Begin typing your search above and press return to search.
'థ్రెడ్స్'లోకి డేవిడ్ వార్నర్..కమిన్స్ సెటైర్.. రిషబ్ స్మైల్స్!
By: Tupaki Desk | 8 July 2023 5:17 PM GMTప్రస్తుతం మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్ ఫాంస్ లో "థ్రెడ్స్" ఎంటరైన సంగతి తెలిసిందే. ఎంటరవ్వడమే రికార్డులు సృష్టించే పని లో ఉందని టెక్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఈ థ్రెడ్స్ పై ట్విట్టర్ లీగల్ నోటీసులు పంపించే విషయాన్ని కాసేపు పక్కనపెడితే... ప్రస్తుతం ఈ ఫ్లాట్ ఫాం ఆన్ లైన్ లో కొత్త కొత్త అకౌంట్లతో హల్ చల్ చేస్తుంది. ఈ సందర్భంగా ముగ్గురు క్రికెటర్ల మెసేజ్ లు హాట్ టాపిక్ గా మారాయి.
మార్క్ జుకర్ బర్గ్ నేతృత్వం లోని మెటా సంస్థ.. ట్విటర్ తరహా లో "థ్రెడ్స్"ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ కొత్త ప్రపంచం లోకి ఎంటరవుతున్న సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల తో పాటు నెటిజన్లు అకౌంట్స్ ప్రారంభిస్తున్నారు. వీరి లో ప్రముఖ క్రికెటర్ డెవిడ్ వార్నర్ కూడా ఎంటరయ్యి పెట్టిన ఫస్ట్ మెసేజ్ వైరల్ అయ్యింది!
అవును... తాజాగా థ్రెడ్స్ లోకి ఎంటరైన డెవిడ్ వార్నర్ ఈ విషయాన్ని అభిమానుల తో పంచుకున్నాడు. @davidwarner31 పేరుతో వార్నర్ కొత్త ఖాతా తెరిచాడు. "నేను ఇప్పుడు "థ్రెడ్స్"లోకి వచ్చాను" అని తొలి పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ లో ఆసీస్ టెస్ట్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ను ట్యాగ్ చేశాడు. దీంతో వార్నర్ ఫస్ట్ పోస్ట్ పై స్పందించిన కమిన్స్... "దయచేసి ఇక్కడ డాన్స్ వీడియోలు వద్దు" అని సెటైరికల్ గా స్పందించారు.
ఈ సందర్భంగా ఆ సెటైర్స్ ని కంటిన్యూ చేసే పని లోకి దిగిన రిషబ్ పంత్... "మంచి సలహా బ్రో" అంటూ రెండు స్మైలింగ్ ఎమోజీ లతో పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ కాన్వర్జేషన్ నెట్టింట వైరల్ అవుతుంది. అయితే... ఇప్పటికే "థ్రెడ్స్" అకౌంట్ ఓపెన్ చేసిన రిషభ్ పంత్.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి బర్త్ డే విషెస్ కూడా తెలియజేశాడు.
కాగా... టిక్ టాక్, ఇన్ స్టా రీల్స్ లో.. తన డ్యాన్స్, స్పూఫ్ వీడియో లతో డేవిడ్ వార్నర్ భారత అభిమానుల ను అలరిస్తున్న సంగతి తెలిసిందే. మరిముఖ్యంగా "బుట్ట బొమ్మా..." సాంగ్ కు డాన్స్ వెయ్యడంంతోపాటు.. తాజాగా "పుష్ప – 2" కు సంబంధించిన పోస్టర్ ను కూడా ఇమిటేట్ చేసి తెలుగు ప్రేక్షకుల కు మరింత దగ్గరయ్యాడనే కామెంట్లు సంపాదించుకున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే థ్రెడ్స్ లో కూడా డ్యాన్స్ వీడియో లతో తమను ఇబ్బంది పెట్టవద్దని ప్యాట్ కమిన్స్ వార్నర్ ను సెటైరికల్ గా రిక్వెస్ట్ చేయగా.. ఆ సెటైరికల్ కామెంట్ తో రిషబ్ పంత్ ఏకీభవించాడు.
ఆ సంగతులు అలా ఉంటే... మరోవైపు, మార్క్ జుకర్ బర్గ్ పై కేసు వేసేందుకు ట్విటర్ సిద్ధమవుతోందంటూ వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ట్విటర్ వ్యాపార సంబంధిత రహస్యాలు, మేథో సంపత్తి హక్కుల ను వినియోగించి థ్రెడ్స్ రూపొందించారంటూ ట్విట్టర్ తరపు న్యాయవాది... మెటా సీఈఓ మార్గ్ జుకర్ బర్గ్ కు తాజాగా ఓ లేఖ రాసిన సంగతి తెలిసిందే!