Begin typing your search above and press return to search.
రైతు ఉద్యమానికి గిల్ కుటుంబం మద్దతు ..!
By: Tupaki Desk | 4 Dec 2020 3:30 PM GMTకేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం ఊపందుకున్న విషయం తెలిసిందే. హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన రైతులు ఈ బిల్లులపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే మెల్లగా ఈ ఉద్యమం మిగతా రాష్ట్రాలకు కూడా పాకింది. ప్రస్తుతం ఈ ఉద్యమం రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు పాకింది. కేంద్రప్రభుత్వం చర్చలతో సమస్యలను పరిష్కరించాలని యోచిస్తున్నప్పటికి రైతు సంఘాలు మాత్రం మెత్తబడటం లేదు. కేంద్రం తీసుకొచ్చిన బిల్లులను రద్దుచేయాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో రైతు ఉద్యమాలకు పలుసంఘాల నుంచి మద్దతు వస్తున్నది. అయితే తాజాగా టీం ఇండియా యువ క్రికెటర్ శుబ్‌మన్ గిల్ కుటుంబసభ్యులు రైతు ఉద్యమానికి మద్దతు తెలిపారు. శుబ్‌మన్ గిల్ రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. గిల్ కూడా పలుమార్లు వ్యవసాయం అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. రిటైర్ అయ్యాక వ్యవసాయం చేస్తానని కూడా చెప్పాడు. తాజాగా గిల్ కుటుంబం రైతుల ఉద్యమానికి మద్దతు ప్రకటించింది.
ఈ విషయంపై గిల్ తండ్రి లఖ్వీందర్‌సింగ్ మాట్లాడుతూ.. ‘నూతన వ్యవసాయచట్టానికి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమానికి తమ కుటుంబం పూర్తి మద్దతు తెలుపుతున్నది. మాది వ్యవయసాయకుటుంబం. గిల్‌కు కూడా వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం. తాను క్రికెటర్ కాకపోయి ఉంటు కచ్చితంగా అన్నదాత అయ్యేవాడు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను వెంటనే వెనక్కి తీసుకొవాలి. ఈ చట్టాలు రైతుల హక్కులను కాలరాసేలా ఉన్నాయి. ఈ విషయంపై గిల్ ఎలా స్పందిస్తాడో తెలియదు. అతడు టీంఇండియాకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. మా అభిప్రాయాలను మా కుమారుడు అర్థం చేసుకుంటాని భావిస్తున్నాం’ అని ఆయన తండ్రి పేర్కొన్నాడు. అయితే గిల్ ప్రస్తుతం ఆసిస్ పర్యటనలో ఉన్నారు.