Begin typing your search above and press return to search.
బ్యాంకుల్ని దెబ్బ కొడుతున్న క్రెడిట్ కార్డులు
By: Tupaki Desk | 31 Oct 2020 11:00 AM ISTఇప్పటికే సవాలచ్చ ఇబ్బందులతో కిందామీదా పడుతున్న బ్యాంకులకు ఇప్పుడు మరో కొత్త తలనొప్పి మొదలైంది. కరోనా దెబ్బకు చోటుచేసుకున్న విపరిణామాల్లో ఇప్పుడు మరో అంశాన్ని గుర్తించారు. ఇప్పటికే కార్పొరేట్ మొండి బకాయిలతో విలవిలలాడుతున్న బ్యాంకులకు.. క్రెడిట్ కార్డులపై ఇచ్చిన రుణాలు తిరిగి చెల్లింపులు చోటు చేసుకోవటం లేదు. క్రెడిట్ కార్డు రుణాలు బ్యాంకులకు ఇప్పుడు షాకింగ్ గా మారాయి. బ్యాంకుల వృద్ధిరేటును భారీగా ప్రభావితం చేస్తాయంటున్నారు. తిరిగి..తిరిగి ఈ పరిస్థితి ఎటు దారి తీస్తుందన్నది ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది.
ఆర్ బీఐ నివేదిక ప్రకారం.. కరోనా వేళ తలెత్తిన సంక్షోభంతో క్రెడిట్ కార్డు మీద జారీ చేసిన రుణాలు ముప్పులో పడినట్లుగా పేర్కొన్నారు. ఈ మొత్తం విలువ దగ్గర దగ్గర రూ.లక్ష కోట్లు మేర ఉండటం గమనార్హం. కరోనా పుణ్యమా అని పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోవటం.. ఆదాయ మార్గాలు తగ్గిపోవటం.. వ్యాపారాలు దారుణంగా దెబ్బ తినటం లాంటి కారణాలతో క్రెడిట్ కార్డుల్ని పెద్దఎత్తున వినియోగిస్తున్నారు.
చాలామంది హౌస్ లోన్.. వెహికిల్ లోన్.. లాంటి వాటిని క్లియర్ చేస్తూ.. క్రెడిట్ కార్డు పేమెంట్లను నిలిపివేయటం బ్యాంకులకు ఇప్పుడో తలనొప్పిగా మారింది. జులై-సెప్టెంబరు మధ్యనున్న మూడు నెలల కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పెద్దన్న లాంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన క్రెడిట్ కార్డులకు సంబంధించి నిరర్థక ఆస్తులు 4.29 శాతానికి చేరటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు.