Begin typing your search above and press return to search.
సినిమా తరహా ఐడియాలతో ఎర్రచందనం స్మగర్లు ..
By: Tupaki Desk | 17 Dec 2020 11:00 AM ISTఎర్రచందనం .. శేషాచలం అడవుల్లో తప్ప , ప్రపంచంలో ఏ మూల కూడా చిక్కని అత్యంత అరుదైన , చాలా ఖరీదైన కలప. ఈ దుంగలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉండటం తో , ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ కి ఎక్కువ మంది ప్రయత్నిస్తుంటారు. అత్యంత అరుదుగా చిక్కే ఈ కలప కోసం ఎంత మొత్తమైన చెల్లించడానికి సిద్ధంగా ఉండటం తో స్మగ్లర్లు కూడా ఈ దుంగల స్మగ్లింగ్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అయితే , ఈ దుంగలు స్మగ్లర్లు స్మగ్లింగ్ చేయకుండా టాస్క్ ఫోర్స్ అధికారులు నిత్యం అడవుల్లో గస్తీ కాస్తుంటారు. అయితే , పోలిసుల కళ్లు గప్పి స్మగ్లింగ్ చేసేవారు. కానీ, ఈ మధ్య టాస్క్ ఫోర్స్ గస్తీ మరింతగా పెరిగిపోవడం తో స్మగ్లింగ్ చేయడం కష్టమైపోయింది.
అయితే , టాస్క్ ఫోర్స్ అధికారులకే దిమ్మతిరిగేలా స్మగ్లర్లు తమ క్రియేటివిటీ చూపిస్తూ స్మగ్లింగ్ కి పాల్పడుతున్నారు. తిరుమల కొండ మీదుగా శేషాచలం అడవుల్లోకి ప్రవేశించేందుకు కొత్త మార్గాలు అనుసరిస్తున్నారు. భక్తుల వేషాల్లో కొండపైకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అలా శేషాచలం అడవుల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన 15 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అడ్డుకోగలిగారు టాస్క్ ఫోర్స్ అధికారులు. వారిలో ఒకరిని అరెస్ట్ చేశారు. అతని దగ్గర మూడు రకాల దుస్తులు ఉండటం చూసి టాస్క్ పోర్స్ అధికారులకు అనుమానం వచ్చి, ఆరా తీస్తే.. కొండపైకి వచ్చేందుకు , పైన భక్తుల ముసుగుల తిరిగేందుకు తెల్ల దుస్తులు, కాషాయ దుస్తులు తెచ్చుకున్నట్టు తెలిపాడు. అలాగే.. అడవుల్లో ఎర్రచందనం చెట్లు కొట్టేందుకు అవసరమైన సామాగ్రి కూడా అతని బ్యాగ్ లో ఉంది.