Begin typing your search above and press return to search.

సీఆర్డీఏ భూమి తాకట్టు ఏపీ ప్రభుత్వం..: ఎందుకంటే..?

By:  Tupaki Desk   |   7 Feb 2022 8:30 AM GMT
సీఆర్డీఏ భూమి తాకట్టు ఏపీ ప్రభుత్వం..: ఎందుకంటే..?
X
ఏపీ రాజధానిలో సీఆర్డీఏ భూమిని ప్రభుత్వం తాకట్టు పెట్టింది. సీఆర్డీఏ తీసుకునే 3 వేల కోట్ల రూపాయల రుణం కోసం దీనిని తాకట్టు పెట్టారని తెలుస్తోంది. గతంలో హడ్కో తీసుకున్న రుణం కోసం తాకట్టు పెట్టిన భూమికి ప్రత్యామ్నాయం సీఆర్టీఏకు చెందిన భూమిని తనఖా పెట్టారా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈమేరకు తాకట్టుకు సంబంధించిన పనులు పూర్తి చేసినట్లు సమాచారం. పీఆర్సీపై ఉద్యోగులు చేసిన ఆందోళనలో భాగంగా పెన్ డౌన్ నిర్వహించిన రోజే ఈ ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇదే రోజు తనఖాకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ను పూర్తి చేశారని అంటున్నారు.

రాజధానికి సమీపంలోని అనంతవరం, మందడం, ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం, వెంకటపాలెం గ్రామాల్లో దాదాపు 480 ఎకరాల సీఆర్టీఏ భూమిని తనఖా పెట్టినట్లు తెలుస్తోంది. ఈ గ్రామాల్లోని భూముల రిజిస్ట్రేషన్ ను మందడం కార్యాలయంలో చేశారు. గతంతో 3 వేల కోట్ల రూపాయల రుణం కోసం భూమిని తాకట్టు పెడుతానని ప్రతిపాదనలు చేసింది. అప్పట్లో సీఆర్టీఏకు గ్యారంటీ ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే రిజిస్ట్రేషన్ జరిగిన మాట వాస్తవమేనని ఆ శాఖ అధికారులు తెలుపుతున్నా.. ఎవరి కోసం చేశారనే వివరాలు వెల్లడించడం లేదు.

గతంలో రైతులకు ఇచ్చిన భూమిని అభివృద్ధి చేస్తామని సీఆర్టీఏ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అయితే అందుకోసం రుణం కావాలని అందుకు ప్రభుత్వ గ్యారంటీ కావాలని తెలపగా.. దానికి ప్రభుత్వం అంగీకరించింది. అయితే ఈ ప్రతిపాదన అప్పటి నుంచి పెండింగ్లో ఉంది. తాజాగా ఈ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఇక మంగళగిరి ప్రాంతంలో ఇటీవల జగనన్న టౌన్ షిప్ ను ప్రారంభించింది. గతంలో హడ్కో నుంచి సీఆర్డీఏ 12 వందల కోట్ల రూపాయలను రుణం తీసుకునే సమయంలో జగనన్న టౌన్ షిప్ కు చెందిన భూమిని హడ్కోకు తాకట్టు పెట్టారు.

దీంతో ఆ భూమిలో జగనన్న టౌన్ షిప్ కు ప్రతిపాదనలు పెట్టడంతో ప్రత్యామ్నాయంగా మరో భూమిని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం 480 ఎకరాలను హడ్కోకు తాకట్టు పెట్టిందని తెలుస్తోంది. అయితే ఈ భూమిని సీఆర్డీఏ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. రైతులకు ఇచ్చిన భూములను, సీఆర్డీఏ కింద ఉన్న భూమిని తాకట్టు పెట్టేందుకు అధికారం ఉంటుంది. అయినా మాస్లర్ ప్లాన్ ను ఉల్లంఘించారని రైతులు అంటున్నారు.