Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తిలో బిజినెస్ చేసే అవ‌కాశం కావాలా?

By:  Tupaki Desk   |   1 Nov 2015 6:45 AM GMT
అమ‌రావ‌తిలో బిజినెస్ చేసే అవ‌కాశం కావాలా?
X
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి ఇప్ప‌టికే సృష్టిస్తున్న క్రేజ్ సంగ‌తి తెలిసిందే. దేశ విదేశీ ప్ర‌తినిధులు ఈ న‌వ న‌గ‌రిపై ఆస‌క్తి ప్ర‌ద‌ర్శిస్తున్నారు. కాసింత స్థ‌లం దొరికితే బాగుండు అనుకుంటున్న సంస్థ‌ల సంఖ్య భారీగానే ఉంది. వీలైతే అమ‌రావ‌తిలో లేదంటే రాజ‌ధాని ప్రాంత ప‌రిధిలో అయినా త‌మకో బిజినెస్ స్పేస్ ద‌క్కుతుందా అని ప‌లు బ‌డా సంస్థ‌లు ఆలోచిస్తున్నాయి. అయితే ఇలాంటి సందేహాల‌న్నింటికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (AP CRDA ) క్లారిటీ ఇచ్చింది.

మంచి బిజినెస్ ఐడియాలు ఉన్నాయి కానీ...రాజ‌ధాని ప్రాంతంలో వ్యాపారం చేసేందుకు అవకాశాలు దొరకడం లేదని అనుకుంటున్న వాళ్ల‌కు అవకాశం ఇవ్వచ్చేందుకు సీఆర్‌డీఏ సిద్దమైంది. ఈ-కామర్స్‌లో స్టార్టప్‌ ల హవా రేంజ్‌ ఎంటో ఈ పాటికే తేలిపోయింది. చిన్న చితకా కంపెనీలు వేల కోట్ల టర్నోవర్‌ తో దూసుకుపోతున్నాయి. వస్తు ఉత్పత్తి రంగంలోనూ మీ దగ్గర ఇదే తరహా ఐడియాలుంటే.. సీఆర్‌డీఏ సాదర స్వాగతం పలుకుతోంది. రాజధాని ప్రాంతంలో చిన్న...మధ్య తరహ వ్యాపార సంస్ధలను ఏర్పాటు చేయాలనుకునే వారిని ప్రోత్సహించేందుకు CRDA ప్రణాళికలను సిద్ధం చేసింది.

CRDA అధికారిక వెబ్ సైట్ (crda.ap.gov.in)లో దీనికి సంబంధించిన వివరాలను ఇప్పటికే పొందుపర్చారు. కొత్త కొత్త ఆలోచనతో CRDA ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ ప్రయోజనాలను పొందాలనుకునే వాళ్లు.. వెబ్‌సైట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో ప్రాజెక్టు వివరాలు జత చేయాలి. దరఖాస్తులను పరిశీలించిన తర్వాత... శిక్షణ కార్యక్రమానికి ఎంపిక చేస్తారు. CRDAకు ఎంపికైన ఔత్సాహికులకు వ్యాపార సంస్థ ఏర్పాటు, నిర్వహణ అంశాలపై నాలుగు వారాల పాటు శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణకు అయ్యే ఖర్చును కూడా CRDA భరిస్తుంది. అలాగే ఉత్పత్తి.. సేవల రంగంలో సంస్థల ఏర్పాటు.. సంస్థ నిర్వహణ కోసం అవసరమైన బ్యాంకు లింకేజీకి పూర్తి సహాయ సహాకారాలుంటాయి.