Begin typing your search above and press return to search.

యాక్టర్ అవుదామని వచ్చి పిచ్చిదైంది.!.. మహిళా పోలీస్ మానవత్వం

By:  Tupaki Desk   |   14 July 2020 10:45 AM GMT
యాక్టర్ అవుదామని వచ్చి పిచ్చిదైంది.!.. మహిళా పోలీస్ మానవత్వం
X
సినిమాల్లో నటించాలన్న పిచ్చి ఆమెను చెన్నైకి రప్పించింది. కానీ అవకాశాల వేటలో అలసిసొలసి కాలం కలిసిరాకపోవడంతో డిప్రెషన్ తో పిచ్చిదైపోయింది. ఓ చెత్త కుప్ప పక్కన వెర్రి చూపులు చూస్తున్న అందమైన యువతి ఓ మహిళా పోలీస్ కంట పడింది. ఆరాతీయగా.. ఆశలు నెరవేరక రోడ్డుపాలైన ఆమె కన్నీటి కథ కనిపించింది.

ఈ ఆదివారం చెన్నైలో సంపూర్ణ లాక్ డౌన్ విధించారు. సచివాలయ ఉద్యోగుల క్వార్టర్ పోలీస్ స్టేషన్ లో పనిచేసే మహిళా ఇన్ స్పెకర్ రాజేశ్వరి జీపులో గస్తీ తిరుగుతుండగా చెత్త కుప్ప పక్కన చింపిరి జుట్టు, పూర్తిగా నలిగి మాసి, చిరిగిపోయిన చుడీదార్ దుస్తుల్లో కూర్చొని ఉన్న ఒక అందమైన అమ్మాయిని చూసి ఇన్ స్పెక్టర్ రాజేశ్వరి కదిలిపోయింది.

ఆమెను పోలీస్ స్టేషన్ తీసుకొని ఆకలితో అలమటిస్తున్న ఆమెకు భోజనం పెట్టి దుస్తులు మార్చి వివరాలు తెలుసుకుంది. ఆ యువతి పేరు భారతి. ఆమె తండ్రి రిటైర్డ్ ఉద్యోగి చనిపోయాడు. తల్లి కూడా చనిపోవడంతో ఒంటరి అయ్యింది. సినిమాలపై పిచ్చితో వెంపర్లాడేది. తల్లిదండ్రి బతుకున్నప్పుడు అభిషేక్ బచ్చన్ నే చేసుకుంటానని మొండికేసి సంబంధాలన్నీ చెడగొట్టింది.. అభిషేక్ కు ఐశ్వర్యతో పెళ్లి కావడంతో కృంగిపోయింది. ఆ తర్వాత సినిమాలపై పిచ్చితో రోడ్డున పడి అవకాశాలు దొరకకపోవడంతో మానసికంగా కుదేలైందని పోలీసుల విచారణలో తేలింది.

ఈమె అత్త ఆచూకీ కనుగొని భారతిని తీసుకుపోమ్మంటే తీసుకెళ్లలేదు. ఇక చెల్లికి చెప్పినా మా అక్క ఇంట్లో అస్సలు ఉండదు. ఆగదు.. నా వల్ల కాదు అంటూ చేతులెత్తేసింది. అనాథశరణాలకు ఫోన్ చేసినా కరోనా టైంలో చేర్చుకోమన్నారు. దీంతో ఆమెకు కరోనా పరీక్షలు చేసి ఆమెను ఓ ప్రభుత్వ ఆశ్రమంలో చేర్పించడానికి మహిళా పోలీసు రాజేశ్వరి నిర్ణయించింది. ఇలా అందమైన యువతి సినిమా పిచ్చితో ఇలా రోడ్డునపడింది. ఓ మహిళా పోలీస్ దయాగుణం వల్ల బతికి బట్టకట్టింది.