Begin typing your search above and press return to search.

నిజంగా నిజం.. అక్క‌డ కమ‌లం ఎర్ర‌బ‌డింది!

By:  Tupaki Desk   |   9 May 2018 4:53 AM GMT
నిజంగా నిజం.. అక్క‌డ కమ‌లం ఎర్ర‌బ‌డింది!
X
అందుకే అంటారు రాజ‌కీయాల్లో శాశ్విత శ‌త్రువులు.. శాశ్విత మిత్రులు ఉండ‌ర‌ని. సైద్ధాంతికం మొద‌లుకొని.. అన్నింటిలోనూ వేర్వేరు అయిన‌ప్ప‌టికీ రాజ‌కీయం అన్న మాట కార‌ణంగా భిన్న ధ్రువాలు ఏక‌మైన విచిత్ర ప‌రిస్థితి ప‌శ్చిమ‌బెంగాల్‌ లో చోటు చేసుకుంది. దేశంలో మ‌రెక్క‌డా లేని రీతిలో క‌మ‌ల‌నాథులు క‌మ్యూనిస్టుల‌తో చెట్టాప‌ట్టాలు వేసుకున్న వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్పాలి.

నిద్ర లేచింది మొద‌లు ప‌డుకునే వ‌ర‌కూ క‌మ‌ల‌నాథులంటే చిరాకు ప‌డిపోయే క‌మ్యూనిస్టులు.. అదే రీతిలో కామ్రేడ్స్ అన్న మాట వినిపించినంత‌నే గ‌య్యి మంటూ విరుచుకుప‌డే క‌మ‌ల‌నాథులు ప‌శ్చిమ‌బెంగాల్ లో మాత్రం అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తిరుగులేని రీతిలో అధికారాన్ని చేప‌ట్ట‌ట‌మే కాదు.. స‌మీప భ‌విష్య‌త్తులో త‌న ప‌ట్టును విడిచేందుకు ఏ మాత్రం సిద్ధంగా లేని మ‌మ‌తా బెన‌ర్జీ తీరుతో కాషాయం.. క‌మ‌లం ఏకం కావాల్సిన ప‌రిస్థితి చోటు చేసుకుంది.

బీజేపీని దెబ్బేసేందుకు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లో ఏ రీతిలో అయితే స‌మాజ్ వాదీ పార్టీ.. బీఎస్పీలు చెట్టాప‌ట్టాలు వేసుకున్నాయో ఇంచుమించు అదే తీరును ప‌శ్చిమ‌బెంగాల్లో ప్ర‌ద‌ర్శిస్తున్నారు క‌మ్యూనిస్టులు.. క‌మ‌ల‌నాథులు. ఎందుకిలా అంటే.. దీదీని దెబ్బ తీయ‌టానికే. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో మ‌మ‌తను రాజ‌కీయంగా దెబ్బేసే సీన్ అటు కమ్యూనిస్టుల‌కు.. కాషాయ‌ద‌ళానికి లేదు. ఈ నేప‌థ్యంలో దీదీకి షాకిచ్చేందుకు బీజేపీ.. సీపీఎంలు ఒక్క‌ట‌య్యారు. ఆ రాష్ట్రంలో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న పంచాయితీ ఎన్నిక‌ల్లో వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి రెండు పార్టీలు.

బ‌య‌ట‌కు త‌మ మిత్ర‌త్వం గురించి చెప్పుకోని రెండు పార్టీలు.. ఒక‌రు బ‌రిలో నిలిచిన చోట మ‌రొక‌రు పోటీలో ఉండ‌కుండా ఉంటూ జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

ఏమైనా స‌రే.. మ‌మ‌త‌ను ఓడించ‌ట‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నాయి. మ‌మ‌త‌ను దెబ్బ తీయాలంటే ఓటు చీల‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన బీజేపీ..సీపీఎం పార్టీలు లోగుట్టుగా సీట్ల స‌ర్దుబాటు చేసుకున్న‌ట్లు చెబుతున్నారు. దీనికి ముందుగా ఈ రెండు పార్టీలు క‌లిసి తృణ‌మూల్ కాంగ్రెస్ నేత‌ల ఆరాచ‌కానికి వ్య‌తిరేకంగా సంయుక్తంగా నిర‌స‌న ర్యాలీని నిర్వ‌హించారు. ఇలా మొద‌లైన వారి బంధం ఇప్పుడు పంచాయితీ ఎన్నిక‌ల్లో ఒక‌రినొక‌రు గౌర‌వించుకుంటూ.. ఒక‌రు పోటీకి దిగిన చోట మ‌రొక‌రు వెన‌క్కి త‌గ్గుతున్న ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంటోంది. ఇద‌లాఉంటే.. త‌మ‌ను దెబ్బ తీసేందుకే ఇలాంటి ప్ర‌చారాన్ని తృణ‌మూల్ నేత‌లు చేస్తున్న‌ట్లుగా సీపీఎం చీఫ్ సీతారాం ఏచూరి మండిప‌డుతున్నారు. మ‌రి.. బెంగాలీ బాబులు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.