Begin typing your search above and press return to search.

పవన్ కు ఏమైనా జరిగితే బాబు దే బాధ్యత!!

By:  Tupaki Desk   |   1 Oct 2018 11:44 AM IST
పవన్ కు ఏమైనా జరిగితే బాబు దే బాధ్యత!!
X
పవన్ కళ్యాణ్ తన ప్రాణాలకు ముప్పు అని ఇటీవల ప్రకటించడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది. సీఎం చంద్రబాబు ఈ విషయంలో కావాలనే నిర్లక్ష్యం వహిస్తున్నాడని జనసేన నాయకులు ఆడిపోసుకున్నారు. తాజాగా సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా పవన్ భద్రతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కు ఏమైనా జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భగ్గుమంటుందని.. దీనికి చంద్రబాబే బాధ్యత వహించాలని హెచ్చరించారు. విజయవాడలో విలేకరులతో మాట్లాడిన రామకృష్ణ రాష్ట్రంలో శాంతి భద్రతలు రోజురోజుకు దిగజారుతున్నాయని ధ్వజమెత్తారు. తన భద్రతపై పవన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నా చంద్రబాబు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన నిలదీశారు. పవన్ కళ్యాణ్ కు వెంటనే భద్రతను పెంచాలని డిమాండ్ చేశారు.

ఏపీలో పోలీస్ వ్యవస్థ వైఫల్యం చెందుతోందని సీపీఐ రామకృష్ణ ధ్వజమెత్తారు. విశాఖ జిల్లా మన్యంలో ఎమ్మెల్యే - మాజీ ఎమ్మెల్యేలను మావోయిస్టులు పట్టపగలు కాల్చి చంపారని.. అనంతపురంలో ఎంపీ - పోలీసులకు మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోందని.. వీటిని కంట్రోల్ చేయలేని అసమర్థ ప్రభుత్వమంటూ మండిపడ్డారు.

ఇక రాష్ట్రంలో ఎన్నికల వేళ నిరుద్యోగ భృతి ప్రకటించి ఓట్లు దండుకునేందుకు బాబు ప్లాన్ చేశారని రామకృష్ణ విమర్శించారు. ఉపాధి హామీ కూలికి వెళితే కూడా నిరుద్యోగులకు రూ.1000 కంటే ఎక్కువే వస్తుందని సెటైర్ వేశారు. అధికారంలోకి వస్తే లక్షల ఉద్యోగాలిస్తామని.. అవి కల్పించకుండా ఇప్పుడు షరతులతో రూ.1000 భృతి ఇస్తున్నారంటూ మండిపడ్డారు. బాబు వైఖరి చూస్తుంటే అన్న క్యాంటీన్ లో భోజనం చేసి చెట్టు కింద పడుకోమన్నట్లు ఉందని దుయ్యబట్టారు. కరువు ప్రాంత సమస్యలపై ఉద్యమించేందుకు సీపీఐ - సీపీఎం అక్టోబర్ 3న సమావేశమవుతున్నామని వివరించారు.

శ్రీరెడ్డికి చెప్పావ్ కదా.. నువ్వెందుకు చేయవు

పవన్ కళ్యాణ్ తన ప్రాణహాని ఉందని ఇటీవల ప్రకటించడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది. ఇది హాట్ టాపిక్ గా మారడంతో తాజాగా దీనికి కౌంటర్ గా వివాదాస్పద రివ్యూ రైటర్ కత్తి మహేష్ హాట్ కామెంట్స్ చేశారు. పవన్ అంటేనే మండిపడే కత్తి తాజాగా ఒంగోలులో ఓ సభలో మాట్లాడుతూ పవన్ వైఖరిని తప్పుపట్టారు..

కత్తి మహేష్ మాట్లాడుతూ.. ‘పవన్ కళ్యాణ్ అస్సలు రాజకీయ పరిణతి లేకుండా మాట్లాడుతున్నాడని’ విమర్శించారు. ఆయనకు ఎంత పరిణతి ఉందో దీన్ని బట్టి అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. గతంలో శ్రీరెడ్డికి అన్యాయం జరిగినప్పుడు ఆమెను పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలని ఇదే పవన్ సూచించారని.. ఇప్పుడు తనపై కుట్ర జరుగుతోందని తెలిసి కూడా ఎందుకు పోలీసులకు పవన్ ఫిర్యాదు చేయడం లేదని ప్రశ్నించారు. పవన్ కు నిజంగా ప్రాణహాని ఉంటే ఆయన ఎందుకు భద్రత కోరడం లేదని డిమాండ్ చేశారు..

ఇక ఈ సభలో దళితుల రాజ్యాధికారంపై కూడా కత్తి మహేష్ ప్రసంగించారు. దళితులకు రాజ్యాధికారం రావాలని.. దళితుల్లో కోత్త నాయకత్వం తెచ్చేందుకే తాను రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నానని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో దళిత, గిరిజనుల హక్కులను కాపాడే పార్టీ తరఫున రాష్ట్రంలోని ఏదో ఒక పార్లమెంట్ స్థానం నుంచి తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు.