Begin typing your search above and press return to search.

అవినీతి పై ఓ ఎంపీ చెంపకేసి జగన్ కొట్టాడన్న సీపీఐ రామకృష్ణ!

By:  Tupaki Desk   |   25 Oct 2021 11:35 AM GMT
అవినీతి పై ఓ ఎంపీ చెంపకేసి జగన్ కొట్టాడన్న సీపీఐ రామకృష్ణ!
X
ఏపీ సీఎం జగన్ చేసిన ఓ పనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఐ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ. ఏపీలో అవినీతిపై ఏ మంత్రి ఎంత తిన్నాడు? ఏ ఎమ్మెల్యే ఎంత బొక్కాడు అనేది జగన్ మోహన్ రెడ్డి టేబుల్ పై పక్కగా సమాచారం ఉందని.. ఒక ఎంపీ చెంపకేసి కొట్టారంటూ సీపీఐ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలోని మంత్రులు ఎమ్మెల్యేలు, అధికారులు అవినీతి చేశారని రామకృష్ణ ఆరోపించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రాన్ని జగన్ మోహన్ రెడ్డి దివాళా తీయించారని సీపీఐ రామకృష్ణ ఆరోపించారు. దీనికి ఎవరూ ఏం లెక్కలు చెప్పనవసరం లేదన్నారు. రేపు ఒకటో తేదీ ఉద్యోగుల అకౌంట్ లో జీతం పడేదే తెలుస్తుందని సీపీఐ రామకృష్ణ అన్నారు. జీతం పడాలంటే ఎవరో ఒకరు అప్పు ఇవ్వాల్సిందేనన్నారు.

కాంట్రాక్టర్లకు రూ.80వేల కోట్లు పెండింగ్ బిల్లులున్నాయని.. వాళ్లకి ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదని.. కాంట్రాక్టర్లు ఉరేసుకొని చచ్చే పరిస్థితి వచ్చిందంటూ విమర్శించారు.

గతంలో టీడీపీ రాష్ట్రాన్ని అప్పుల మయంగా చేసిందని రామకృష్ణ ఆరోపించారు. నేడు మళ్లీ రాష్ట్రాన్ని అప్పుల్లోకి తీసుకెళ్తున్నారని విమర్శించారు. గతంలో ఎందరో ముఖ్యమంత్రులుగా పనిచేశారని.. ఎన్టీఆర్, చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి.. వీరందరూ పరిపాలన అంటే ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రతిపక్షాలు , కౌన్సిల్ అనేవి ఉండేవని.. ఇప్పుడు ఏక్ నిరంజన్ పాలన అని.. తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటూ ఎవర్నీ దగ్గరికి రానీయడం లేదని విమర్శించారు.

ఏపీకి 2014లో రాష్ట్ర విభజన జరిగేటప్పుడు అప్పును పంచుకున్నారని.. ఏపీకి 97వేల కోట్ల రూపాయల అప్పు వచ్చిందన్నారు. చంద్రబాబు ఐదేళ్ల కాలంలో 1.28 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని విమర్శించారు.