Begin typing your search above and press return to search.
కేంద్రం కేసులు..భయపడ్డ కేసీఆర్!
By: Tupaki Desk | 12 Aug 2019 10:21 AM ISTఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల సందర్భంగా బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో బిల్లులు ఆమోదించుకున్న సంగతి తెలిసిందే. ఇందులో సమాచార హక్కు చట్టం సవరణ బిల్లు ఒకటి. ఈ సవరణకు వివిధ పార్టీలు మద్దతిచ్చాయి. ప్రధానంగా తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ మద్దతు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అనూహ్య రీతిలో కేంద్రానికి కేసీఆర్ మద్దతిచ్చారు. ఈ మద్దతుపై తాజాగా సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సుర వరం సుధాకరరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆర్టీఐ సవరణలతోపాటు అనే కాంశాల్లో టీఆర్ ఎస్.. మోడీ సర్కారుకు మద్దతునిస్తు న్నదని విమర్శించారు.
కేంద్రం బ్లాక్ మెయిల్ చేస్తే టీఆర్ ఎస్ లొంగిపోయిందని సురవరం ఆరోపించారు. ఆర్టీఐ సవరణలకు మద్దతునివ్వబోమంటూ తొలుత రాజ్యసభలో చెప్పిన ఆ పార్టీ పక్షనేత కే.కేశవరావు.. ఆ మరుసటి రోజు యూ టర్న్ తీసుకున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర సమాచార మంత్రి చెప్పిన అంశాలతో తాను సంతృప్తి చెందాననీ, అందువల్లే సవరణల బిల్లుకు రెండో రోజు మద్దతునిచ్చామంటూ ఆయన సమర్థించుకు న్నారని వివరించారు. 'మీరు సంతృప్తి చెందింది బిల్లులోని అంశాలకా..? లేక మీ పార్టీ నాయకులపై పెడతామన్న కేసులకా..?' అని ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఫెడరల్ ఫ్రంట్, రాష్ట్రాల హక్కులంటూ ఊదరగొట్టిన కేసీఆర్.. ఇప్పుడు అదే హక్కులకు భంగం వాటిల్లుతున్నా నోరు మెదపకపోవటం శోచనీయమన్నారు. వైసీపీ- టీడీపీ- బీజేడీ- టీఆర్ ఎస్ లు ఆర్టీఐ సవరణలకు ఎలా మద్దతిస్తాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అంశాలపై ప్రజలు ఆయా పార్టీలను నిలదీయాలని సురవరం ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
దేశంలోని పెట్టుబడిదారులు, బడా కాంట్రాక్టర్లు, ఉన్నత పదవుల్లో ఉన్నవారు, అవినీతికి పాల్పడే ఉన్నతాధికారులకు సమాచార హక్కు చట్టం ప్రతిబంధకంగా మారిందని, అందువల్లే దాన్ని నీరుగార్చేందుకు వారు కంకణం కట్టుకున్నారని సురవరం సుధాకర్ రెడ్డి తెలిపారు. మోడీ సర్కారు వారి ప్రయోజనాలకు అనుగుణంగా చట్టంలో సవరణలు చేసిందని విమర్శించారు. దేశ ప్రధాని మోడీని సైతం బోగస్ వ్యక్తిగా నిలబెట్టిన ఘనత సమాచార హక్కు చట్టానికి దక్కుతుందని సురవరం సుధాకరరెడ్డి అన్నారు. ఆయన విద్యార్హతలకు సంబంధించి ఆర్టీఐ కింద దరఖాస్తు చేస్తే.. ఢిల్లీ విశ్వ విద్యాలయం ఫైళ్లు లేవంటూ బుకాయించిందని గుర్తుచేశారు. ఆయన ఆ యూనివర్సిటీలో చదవకపోవటం వల్లే ఇలాంటి సమాధానం అక్కడి అధికారుల నుంచి వచ్చిందని.. ఇలా మోడీ బండారాన్ని బట్టబయలు చేయటం ఆర్టీఐ వల్లే సాధ్యమైందని తెలిపారు. ఇదే కోవలో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ విద్యార్హతల్లోని డొల్ల తనాన్ని బయటపెట్టారని చెప్పారు. ఇలాంటి కీలక చట్టానికి సవరణలు చేయటం ద్వారా మోడీ సర్కారు.. ఆర్టీఐని నీరు గార్చిందని విమర్శించారు.