Begin typing your search above and press return to search.

జీహెచ్ఎంసీ ఎన్నికలు.. వామపక్షాల తొలి జాబితా విడుదల

By:  Tupaki Desk   |   18 Nov 2020 11:00 PM IST
జీహెచ్ఎంసీ ఎన్నికలు.. వామపక్షాల తొలి జాబితా విడుదల
X
జీహెచ్ఎంసీ ఎన్నికల నగారా మోగడం.. తొలిరోజు నామినేషన్ల గడువు పూర్తి కావడం కూడా జరిగిపోయింది. అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే పనులు పూర్తి చేసుకుంటుండగా అందరికంటే ముందే వామపక్షాలు అన్ని పార్టీలను ఆశ్చర్యపరిచాయి.

జీహెచ్ఎంసీలో ఉమ్మడిగా బరిలోకి దిగుతున్న సీపీఐ, సీపీఎంలు తొలి విడత జాబితాను విడుదల చేయడం విశేషంగా మారింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డీజీ నర్సింహారావు ఈ లిస్ట్ విడుదల చేసి అధికార టీఆర్ఎస్ ను ఓడించాలని.. ఈ ఐదేళ్లలో ప్రజా సమస్యలు తీర్చలేదని విమర్శించారు. దొంగచాటుగా ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. వరద బాధితులకు సాయం చేయలేదని ఆరోపించారు. ప్రజలందరూ తమ పార్టీకి ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

+ వామపక్షాల తొలి జాబితా ఇదే..

* సీపీఐ అభ్యర్థుల మొదటి జాబితా ఇదే..
ఓల్డ్ మలక్‌పేట్‌ -ఫిరదౌజ్ ఫాతిమా
లలిత బాగ్ - మహమ్మద్ ఆరిఫ్ ఖాన్
ఉప్పుగూడ - సయెద్ అలీ
హిమాయత్ నగర్ బి. చాయ దేవి
షేక్‌పేట్ షైక్ షంషుద్దీన్ అహ్మద్
తార్నాక - పద్మ

*సీపీఎం అభ్యర్థుల మొదటి జాబితా
అడ్డగుట్ట 142వ డిజిజన్‌ - టి . స్వప్న
రాంనగర్ 87వ డివిజన్‌ -ఎం. దశరథ్
బాగ్ అంబర్‌పేట్‌ 54వ డివిజన్‌ - ఎం. వరలక్ష్మి
చర్లపల్లి 3 డివిజన్‌ - పి . వెంకట్
జంగమేట్ 45వ డివిజన్‌ - ఎ.కృష్ణ