Begin typing your search above and press return to search.

రాజాసింగ్‌ వ్యాఖ్యలపై లీగల్‌ చర్యలు : సీపీ సజ్జనార్

By:  Tupaki Desk   |   22 Dec 2020 12:33 PM GMT
రాజాసింగ్‌ వ్యాఖ్యలపై లీగల్‌ చర్యలు : సీపీ సజ్జనార్
X
పోలీసులు .. ప్రజలకి రక్షణ కవచాలు. ప్రజలకి ఏ క్షణంలో ఏ అవసరం వచ్చినా , ఏ అపాయం ఎదురైనా కూడా క్షణాల్లో వారి ముందు ప్రత్యక్షం అయ్యే ప్రత్యక్ష దేవుళ్లు. ఎన్నో సందర్భాల్లో తమ మానవతా దృక్పధం చాటుకుంటున్నారు. అయితే , ఎదో కొన్ని సందర్భాల్లో ఎక్కడో ఓ పోలీస్ అధికారి చేసే తప్పుడు పనుల వల్ల , మొత్తం పోలీస్ వ్యవస్థనే తప్పుబడుతుంటారు. ఇక రాజకీయ నేతలు సైతం అప్పుడప్పుడు పోలీసువారిపై ఆరోపణలు చేస్తుంటారు. ప్రభుత్వానికి పోలీసులు కొమ్ము కాస్తున్నారు అంటూ విమర్శలు చేస్తుంటారు. తాజాగా అలాగే మరో నేత కూడా పోలిసుల పై విమర్శలు చేస్తే , సీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ,లీగల్ చర్యలు తప్పవు అంటూ చెప్పుకొచ్చారు.

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ వ్యాఖ్యలకు సైబరాబాద్ సీపీ సజ్జనార్ కౌంటర్‌ ఇచ్చారు. పోలీసులు, డీజీపీపై కామెంట్లు చేయడం ఫ్యాషన్ అయిపోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి పోలీసులు కొమ్ముకాస్తున్నారంటూ రాజాసింగ్‌ చేసిన వ్యాఖ్యలను సీపీ వ్యతిరేకించారు. పోలీసులపై బీజేపీ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కేసులు తప్పవని హెచ్చరించారు. రాజాసింగ్‌ వ్యాఖ్యలపై లీగల్‌ చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్‌ తెలిపారు.