Begin typing your search above and press return to search.

బెజవాడలో కాల్పుల కలకలం.. సీపీ ఆఫీసు ఉద్యోగిని చంపేశారు

By:  Tupaki Desk   |   11 Oct 2020 11:00 AM IST
బెజవాడలో కాల్పుల కలకలం.. సీపీ ఆఫీసు ఉద్యోగిని చంపేశారు
X
షాకింగ్ పరిణామం ఒకటి చోటు చేసుకుంది. శనివారం అర్థరాత్రి తర్వాత విజయవాడ బైపాస్ లో చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు పెను సంచలనంగా మారటమే కాదు పోలీసు శాఖలో తీవ్ర చర్చకు కారణమైంది. కారణం.. ఈ కాల్పుల్లో మరణించింది విజయవాడ సీపీ ఆఫీసులో పని చేసే ఉద్యోగి కావటం. దీనికి తోడు బెజవాడకు పెద్దగా అలవాటు లేని తుపాకీ కాల్పులు.. నగర వాసుల్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

బెజవాడ బైపాస్ రోడ్డులోని సుబ్బారెడ్డి బార్ సమీపంలో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. నగర పోలీస్ సీపీ ఆఫీసులో పని చేసే మహేశ్ అనే ఉద్యోగిని గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు. ఈ కాల్పుల్లో హరి అనే మరో వ్యక్తికి సైతం గాయాలు అయ్యాయి. ఈ కాల్పుల ఉదంతం చూస్తే.. పక్కాగా ప్లాన్ చేసుకొని చేసినట్లుగా కనిపిస్తోంది.

కాల్పుల ఉదంతం తమ వరకు వచ్చినంతనే పోలీసులు వెంటనే అలెర్టు అయ్యారు. హుటాహుటిన చేరుకున్న వారు.. ఇందుకు కారణమైన వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేశారు. పరారీలో ఉన్న వారిని పట్టుకుంటామని చెబుతున్నారు. అసలీ కాల్పుల వెనుక మిస్టరీని చేధించటం పోలీసుల ముందున్న పెద్ద సవాలుగా మారింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది.