Begin typing your search above and press return to search.
గ్యాంగ్ రేప్ కేసులో అదుపులోకి తీసుకున్న ఆటో డ్రైవర్లకు సీపీ సారీ
By: Tupaki Desk | 14 Feb 2021 12:30 PM ISTఅవును.. రాచకొండ కమిషనరేట్ సీపీ మహేశ్ భగవత్ తాజాగా క్షమాపణలు చెప్పారు. అది కూడా.. ఆటో డ్రైవర్లకు. వారికి.. సీపీకి మధ్య ఎలాంటి పంచాయితీ లేదు. కానీ.. ఒక సంచలన కేసు లెక్క తేల్చేందుకు దూకుడుగా వ్యవహరించిన రాచకొండ పోలీసుల కారణంగా దాదాపుఅరవై మంది ఆటో డ్రవర్లు తీవ్ర కష్టాల్ని ఎదుర్కోవటమే.. తీవ్రమైన ఆరోపణల్ని ఫేస్ చేశారు. అన్నింటికి మించి తాము నిజాలు చెబుతున్నా.. పోలీసులు వినని వైనం వారికి పెద్ద సమస్యగా మారిందని చెబుతున్నారు.
ఘట్ కేసర్ వద్ద ఫార్మసీ విద్యార్థిని సామూహిక అత్యాచారాలకు పాల్పడినట్లుగా వచ్చిన వార్తలకు స్పందించిన పోలీసులు.. పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో నలుగురైదుగురు ఆటో డ్రైవర్లు తనను సామూహిక అత్యాచారం చేసినట్లుగా ప్రకటించటంతో అనుమానం వచ్చిన డ్రైవర్లపైన పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపినట్లుగా తేలింది. దీంతో.. వారంతా నిర్దోషులని తేలటంతో పోలీసులు ఇప్పుడు ఆత్మరక్షణలో పడిన పరిస్థితి.
ఇంట్లోని వారిపై కోపంతో ఉన్న ఫార్మసీ విద్యార్థిని.. కిడ్నాప్.. రేప్ నాటకం ఆడి.. పోలీసుల్ని పక్కదోవ పట్టించటమే కాదు.. ఆటో డ్రైవర్లను పూర్తిస్థాయిలో బద్నాం చేసేసిన పరిస్థితి. అయితే.. విచారణ మధ్యలో సందేహాలకు గురైనపోలీసులు శాస్త్రీయ ఆధారాల్ని పక్కాగా పరిశీలించిన తర్వాత.. సదరు బాధితురాలు చెప్పినదంతా అబద్ధమని తేలింది. దీంతో..నేరం చేయకుండానే.. ఆ పేరుతో ఆరోపణలు ఎదుర్కోవటం.. విచారణను ఫేస్ చేయాల్సి రావటంపైనా సీపీ సారీ చెప్పారు. అంతేకాదు.. నేరారోపణల కారణంగా ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు వెయ్యి చొప్పున సామాన్లు అందజేస్తున్నట్లుగా చెప్పారు. ఏమైనా.. చేయని నేరానికి ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని చెప్పక తప్పదు.