Begin typing your search above and press return to search.

ఆవును హగ్​ చేసుకోండి.. రిలాక్స్​ అయిపోతారు.. ఇదో కొత్తథెరపీ

By:  Tupaki Desk   |   3 Nov 2020 11:45 AM IST
ఆవును హగ్​ చేసుకోండి..  రిలాక్స్​ అయిపోతారు.. ఇదో కొత్తథెరపీ
X
సనాతన భారతీయ సాంప్రదాయంలో ఆవుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. హిందువులు ఆవును దైవస్వరూపంగా కొలుస్తారు. ఆవు మూత్రం, పేడను పరమ పవిత్రంగా భావిస్తారు. అయితే ఇప్పుడీ ఆవు ప్రాధాన్యాన్ని ప్రపంచమే గుర్తించింది.

వైద్య శాస్త్రంలో లేటెస్ట్ గా ఓ కొత్త థెరపీ ట్రెండ్​ అవుతోంది. అదే ఆవును హగ్​ చేసుకోవడం. మీరు ఎంత ఒత్తిడిలో ఉన్నా ఒక్కసారి ఆవును హగ్​ చేసుకుంటే మీ ఒత్తిడి మాయమైపోతుందట. దీంతో ఇప్పడు యువత ఈ కొత్త ట్రెండ్​ను ఫాలో అయిపోతున్నారు. ఎక్కడైనా ఆవు కనిపిస్తే వెంటనే దాన్ని హగ్​ చేసుకొని తమ బాధలను మరిచిపోతున్నారు. కొత్త తరహా థెరపీలను భారతీయులు ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు. ప్రకృతి వైద్యం, ఆయిల్ పుల్లింగ్ లాంటి వాటికి మనవాళ్లు ఎక్కువగా కనెక్ట్​ అయిపోతారు. ఇప్పుడు అదే కోవలో ఆవును కౌగిలింతలు మన దేశంలో విస్తరిస్తున్నాయి.

ఈ థెరపీ ఇప్పడికిప్పుడు పుట్టుకొచ్చింది కాదు. నెదర్లాండ్స్‌లోని రీవర్‌లో ఎప్పటి నుంచో దీనిని పాటిస్తున్నారు. ఇప్పుడు దీనికి ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ వచ్చేసింది. గోవుతో కలిగే ఎన్ని ప్రయోజనాలు ఉన్నది మనదేశంలో ఎప్పటినుంచో తెలిసిన వ్యవహారమే. గోమూత్రం, గోమయం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని అంటారు. అందుకనే గోవును గోమాతగా కొలుస్తారు. పురాణేతిహాసాల్లో అయితే చెప్పక్కర్లేదు. 2007లో అప్లైడ్ యానిమల్ బిహేవియర్ సైన్స్ జర్నల్‌లో ఓ అధ్యయనం ప్రచురితమైంది. ఆవును కౌగిలించుకోవడంతో ఒత్తడి దూరమవుతుందని ఆ అధ్యయనంలో స్పష్టం చేశారు. ఆవు వీపు, మెడ, చెవులు, గంగడోలు ప్రేమగా నిమిరితే రిలాక్స్​ అయిపోతామని అందులో పేర్కొన్నారు. చాలా దేశాల్లో 'గో కౌగిలి' కోసం వెల్‌నెస్ సెంటర్లు కూడా వెలిశాయంటే దీని ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు.

గో కౌగిలితో శరీరంలో జరిగే మార్పులేమిటి?

గోవును కౌగిలించుకుంటే.. పిట్యుటరీ గ్రంథి ప్రేరేపితమవుతుందని... ఫలితంగా ఒత్తిడి తగ్గుతుందని నమ్ముతారు. మనకు ఇష్టమైన వ్యక్తులను ప్రేమగా మాట్లాడుతున్నప్పడు సహజంగా ఈ హార్మోన్ విడుదలవుతుంది. క్షీరదాలను ఆలింగనం చేసుకోవడం వల్ల ప్రశాంతమైన భావాలు కలుగుతాయని అధ్యయనాల్లో తేలింది. ప్రస్తుత పోటీప్రపంచంలో మనమంతా ఉరుకులు, పరుగుల జీవితాన్ని గడుపుతున్నాము. ఈ క్రమంలో తీవ్ర మైన పనిఒత్తడికి గురవుతున్నాము. అందువల్ల ఒత్తడిని జయించేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా పాత వైద్య విధానాలను ఆశ్రయిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ గో కౌగిలింతలు ఫేమస్​ అయ్యాయి.