Begin typing your search above and press return to search.

రేసులో మూడు వ్యాక్సిన్లు.. మోడీ సర్కారు ఓకే చెప్పేది దానికేనా?

By:  Tupaki Desk   |   27 Dec 2020 4:30 AM GMT
రేసులో మూడు వ్యాక్సిన్లు.. మోడీ సర్కారు ఓకే చెప్పేది దానికేనా?
X
బ్రిటన్.. అమెరికాతో.. దుబాయ్.. సౌదీ.. ఇలా చాలా దేశాల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే నెలలో దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు మోడీ సర్కారు సిద్ధమవుతోంది. అయితే.. మూడు వ్యాక్సిన్లు రేసులో ఉన్నా.. అనుమతి వచ్చేది.. తొలుత అందుబాటులోకి వచ్చేది మాత్రం ఒక్కటేనని చెబుతున్నారు. ఇంతకీ.. ఆ వ్యాక్సిన్ ఏమిటన్న విషయంలోకి వెళితే.. పుణేకి చెందిన సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తున్న కోవిషీల్డ్ కు అనుమతి లభించే వీలుందని చెబుతున్నారు.

ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ.. ఆస్ట్రాజెనెకా కలిసి రూపొందిస్తున్న టీకాకు కేంద్రం ఓకే చెప్పే అవకాశం ఉందంటున్నారు. భారత్ తో పాటు.. ఇతర దేశాల్లోని టీకా క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించిన నివేదికల్ని జాగ్రత్తగా చూసిన తర్వాత మాత్రమే.. అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చే వీలుందని చెబుతున్నారు.

ప్రస్తుతం వ్యాక్సిన్ రేసులో.. ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ తో పాటు.. ఫైజర్.. భారత్ బయోటెక్ టీకాలు ఉన్నాయి. అయితే.. భారత బయోటెక్ టీకా పరిశోధన మూడో దశలోనే ఉంది. దీంతో.. ఇది వెంటనే మార్కెట్లోకి వచ్చే అవకాశం లేదు. ఫైజర్ సంస్థ రూపొందించిన టీకా పని తీరుపై భారత సర్కారుకు నివేదిక అందాల్సిన అవసరం ఉంది.

దీంతో.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ తొలుత అందుబాటులోకి తెచ్చి.. తర్వాత దశల్లో మిగిలిన రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి తెచ్చే వీలుంది. ప్రపంచంలో అతి పెద్ద టీకా తయారీ సంస్థ సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఇప్పటికే నాలుగు కోట్ల టీకా డోసుల్ని తయారు చేసి.. సిద్దంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆక్స్ ఫర్డ్ సిద్ధం చేసిన కోవిషీల్డ్ కే దేశంలో అత్యవసర వినియోగించే తొలి టీకాగా వినియోగించే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.