Begin typing your search above and press return to search.

మాస్కో నగర ప్రజల కోసం కోవిడ్ వ్యాక్సిన్ రిలీజ్.. షాకింగ్ నిజం ఏమంటే?

By:  Tupaki Desk   |   9 Sept 2020 7:00 PM IST
మాస్కో నగర ప్రజల కోసం కోవిడ్ వ్యాక్సిన్ రిలీజ్.. షాకింగ్ నిజం ఏమంటే?
X
ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ -19కు చెక్ పెట్టేందుకు వీలుగా ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యాక్సిన్ ప్రయోగాలు జోరుగా సాగుతున్నాయి. వ్యాక్సిన్ తయారీకి కీలకమైన ప్రయోగ పరీక్షల విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది రష్యా సర్కారు. ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కోవిడ్ 19 వ్యాక్సిన్ స్పుత్నిక్ ను తాజాగా సాధారణ ప్రజల కోసం విడుదల చేసి షాకిచ్చింది రష్యా ప్రభుత్వం.

ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. కారణం ఏమంటే.. ఈ వ్యాక్సిన్ కు సంబంధించి కీలకమైన మూడో దశ ప్రయోగ పరీక్షలు పూర్తిస్థాయిలో పూర్తికాకపోవటమే. మాస్కోలోని గమాలెయా ఎడిమాలజీ.. మైక్రో బయాలజీ పరిశోధన సంస్థ ఈ వ్యాక్సిన్ ను డెవలప్ చేసింది. ప్రస్తుతం మాస్కో నగరంలో పరిమిత సంఖ్యలో టీకాల్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెబుతున్నారు.

వ్యాక్సిన్ తయారీకి కీలకమైన మూడో ప్రయోగ పరీక్షలు కేవలం 76 మంది మీద మాత్రమే క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. వాటి ఆధారంగా వచ్చిన ఫలితాలతో వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేయటమే కాదు.. బహిరంగ మార్కెట్లోకి తీసుకొచ్చేయటం షాకింగ్ గా మారింది. మూడో దశ క్లినికల్ టెస్టులు భారత్ తో సహా ఇరవై దేశాల్లో చేపట్టాలని రష్యా భావిస్తోంది. సాధారణంగా మూడో దశ వ్యాక్సిన్ ప్రయోగ పరీక్షల కోసం 40 వేల మంది వాలంటీర్లు అవసరం. ఇప్పటికే పాతిక వేల మందిని తీసుకున్నట్లు చెబుతున్నారు.