Begin typing your search above and press return to search.
విజయవాడ చేరుకున్న కోవిడ్ వ్యాక్సిన్ .. !
By: Tupaki Desk | 3 Jun 2021 11:00 AM ISTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గన్నవరం విమానాశ్రయానికి మరో 5 లక్షల కరోనా వైరస్ వ్యాక్సిన్ డోసులు చేరుకున్నాయి. పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి కోవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి. అక్కడి నుంచి వ్యాక్సిన్ ను రోడ్డు మార్గంలో మొదటగా గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు. టీకా నిల్వ కేంద్రం నుంచి వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు వ్యాక్సిన్‌ను తరలించనున్నారు. మొత్తం 30 బాక్సుల్లో మూడు లక్షల అరవై వేల కోవీషీల్డ్ వ్యాక్సిన్లు పూణే సీరం ఇనిస్టిట్యూట్ ఢిల్లీ ఎయిర్ ఇండియా 467 విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి.
ఇక 19 బాక్సుల్లో సుమారుగా 97,280 వేల డోసులు భారత్ బైయోటెక్ నుంచి వ్యాక్సిన్లు చేరుకున్నాయి. విమానశ్రయం నుంచి గన్నవరం రాష్ట్ర టీకా నిల్వ కేంద్రంకి తరలించారు. 13 జిల్లాల తరలించేందుకు వైద్య ఆరోగ్య శాఖ సన్నాహాలు చేస్తోంది. అన్ని జిల్లాల్లోకి వ్యాక్సిన్ అందించేలా ప్లాన్ చేస్తోంది రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ. ఇందుకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పర్యవేక్షిస్తున్నారు.