Begin typing your search above and press return to search.
కోవిడ్ నాలుగో వేవ్ వస్తుందా? నిపుణులు ఏం అంటున్నారు!
By: Tupaki Desk | 20 March 2022 11:00 AM ISTగత కొద్ది రోజులుగా కోవిడ్ నాలుగో వేవ్ పై దేశం అంతా చర్చ జరుగుతుంది. ఇందుకు ప్రధాన కారణం మన దేశానికి అవతల ఉన్న కొన్ని దేశాల్లో కొవిడ్ మరలా విజృంభించడం. ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. దీనికి తోడు ఇజ్రాయిల్ లో రెండు కొత్త వేరియంట్లు బయటపడ్డాయి.
అందులోనూ ఇవి వేగంగా వ్యాప్తి చెందే గుణం ఉన్నది. ఒమిక్రాన్ కు చెందినవి. బీ1, బీ2 అనే పేరుతో పిలువబడుతున్న ఈ రెండు వేరియంట్లను తమ దేశంలో కనిపెట్టినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఇది ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందితే.. తరువాత చాలా తీవ్ర మైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఈ వేరియంట్ కు సంబంధించి మిగతా దేశాలు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.
ప్రస్తుతం ప్రపంచంలో కెల్లా సౌత్ కొరియాలో కొవిడ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. ఆ తర్వాత చైనాలో కూడా వైరస్ వ్యాప్తి భారీగానే ఉంది. దీంతో చైనా లోని ప్రావిన్స్ లో లాక్ డౌన్ విధించింది అక్కడి ప్రభుత్వం. దీని ద్వారా కోవిడ్ కేసులు పెరగకుండా కట్టడి చేయాలని చూస్తున్నారు. ప్రజలను ఎవరినీ కూడా ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. దీనితో పాటు సామూహికంగా టెస్టులు చేస్తున్నారు. జీరో కోవిడ్ విధానాన్ని అమలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే పక్కన ఉన్న భారత్ లో కూడా కొవిడ్ నాలుగో వేవ్ గురించి చర్చ బాగా నడుస్తోంది. ఇప్పటికే పలు సార్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్ వ్యాప్తి పై చర్చించడం. ఇందుకు ప్రపంచ దేశాల తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజెప్పడం తో భారత్ కూడా అప్రమత్తం అయ్యింది.
దీనికి సంబంధించి మన శాస్త్రవేత్తలు కొందరు కోవిడ్ నాలుగో వేవ్ గురించి హెచ్చరించడంతో జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు కేంద్రం ముందుకు వస్తుంది. కానీ మన దేశంలో కొవిడ్ నాలుగో వేవ్ కచ్చితంగా వస్తుందా అని అంటే పక్కాగా చెప్పలేం. కానీ ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేకపోలేదు అని నిపుణులు అంటున్నారు.
అయితే కోవిడ్ నాలుగో వేవ్ గురించి పరిశోధకులు చెప్తున్న మరో మాట ఏంటి అంటే... ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం ఇతర దేశాల్లో ఎలా ఉన్నా కానీ మన దేశంలో మాత్రం చాలా తక్కువ సమయంలోనే తగ్గిపోయింది అని చెప్పాలి.
ఇందుకు మనం తీసుకున్న వ్యాక్సిన్ లు ఒక కారణం అయితే మరో కారణం మనం తీసుకునే ఫుడ్. దీని కారణంగా ఒక్క సారి లేచిన కోవిడ్ అంతే స్పీడ్ గా దిగిపోయింది. ఎక్కువ శాతం మందికి వైరస్ సోకినా కానీ మనకు ఉన్న వ్యాధి నిరోధక శక్తి వల్ల త్వరగా కోలుకుంటారని.. అయితే నాలుగో వేవ్ వచ్చినా కానీ పెద్ద ప్రభావం చూపక పోవచ్చు అని అంటున్నారు.
ఒమిక్రాన్ వచ్చి ఎక్కువ రోజులు కాలేదు కాబట్టి... మన లోని చాలా మంది శరీరంలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. దీంతో నాలుగో వేవ్ వచ్చినా కానీ.. మొదటి రెండు వేవ్ ల మాదిరిగా పెద్దగా ప్రభావం చూపలేక పోవచ్చు అని చెప్తున్నారు. అలా అని కోవిడ్ నియమాలు పాటించకుండా ఉండడం కూడా మంచిది కాదని చెబుతున్నారు.