Begin typing your search above and press return to search.
7 నెలల పాటు పిల్లల్లో కోవిడ్ యాంటీ బాడీలు..!
By: Tupaki Desk | 23 March 2022 6:00 AM ISTకరోనా మళ్లీ ప్రపంచ దేశాల్లో విస్తరిస్తుంది. దీంతో చాలా దేశాలు మరోసారి అప్రమత్తం అయ్యాయి. ఇప్పటి వరకు మూడు వేవ్ లను చూసి ప్రజలు మరోసారి కేసులు పెరుగుదలను చూస్తే మరో వేవ్ కచ్చితంగా వస్తుంది అని భావిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు లక్షల సంఖ్యలో కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. దీంతో కోవిడ్ మళ్లీ కొత్త వేరియంట్ తో దండెత్తి వస్తుందా అనే ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొవిడ్ కు సంబంధించిన మరిన్ని పరిశోధనలు చేపట్టారు శాస్త్రవేత్తలు.
ఈ సారి మాత్రం చిన్న పిల్లలను తీసుకున్నారు. ఇప్పటి వరకు కేవలం యువకులను, లేక మధ్య వయసు, లేక వృద్ధులను మాత్రమే తీసుకుని పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు ఈ మాత్రం పిల్లలను ఎంచుకున్నారు. చిన్నారులు ఒక సారి కొవిడ్ నుంచి కోలుకున్న తరువాత ఎన్ని రోజుల వరకు కరోనా మరలా సోకకుండా ఉండగలరు అనే అంశంపై చేపట్టారు. అయితే ఈ అంశంలో వారు తెలుసుకున్నది ఏంటి అంటే చిన్నారుల్లో కరోనా నుంచి కోలుకోవడానికి సహకరించిన యాంటీ బాడీలు సుమారు 7 నెల పాటు వారిలో ఉంటాయి అని తెలుసుకున్నారు.
కోవిడ్ ఒక్కసారి సోకితే మరలా కూడా సోకే అవకాశం అనేది ఉంది. అయితే ఒక సారి శరీరంలో ఉత్పత్తి అయిన యాంటీ బాడీల నుంచి మనకు రక్షణ అనేది ఉంటుంది. దీంతో మరోసారి వైరస్ సోకాలి అంటే కచ్చితంగా కొంత టైం పడుతుంది. దీని పైనే శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. పిల్లల్లో కొవిడ్ వచ్చి, నయం అయిన నాటి నుంచి సుమారు ఏడు నెలల వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా యాంటీ బాడీలు పిల్లలను రక్షిస్తాయని తెలిసింది.
ఇప్పటి వరకు ఎవరూ చేయని ఈ పరిశోధనను చేసింది అమెరికాకు చెందిన ఓ బృందం. ఈ బృందం లోని శాస్త్రవేత్తలు చేసిన దానిని ఇటీవల ఓ మెడికల్ జర్నల్ కూడా ప్రచురించింది. దీనిని బట్టి కచ్చితంగా పిల్లలకు ఏడు నెలల పాటు యాంటీ బాడీలు ఉంటాయని వారు చెప్తున్నారు.
ఈ పరిశోధకులు చెప్పిన దాని ప్రకారం సుమారు 218 మంది చిన్నారులు వీరి చేసిన పరిశోధనలో భాగం అయ్యారు. కేవలం వీరి పైన మాత్రమే ఈ అధ్యయనం చేసినట్లు చెప్పారు. వీరి నుంచి సేకరించిన డేటా ఆధారంగా పిల్లలో ఎన్ని రోజుల పాటు కోవిడ్ ను ఎదుర్కొనే యాంటీ బాడీలు ఉంటాయి అనేది చెప్పగలిగాను అని అంటున్నారు.
చిన్నారులు అంటే వీరి వయసు ను కూడా పరిగణలోకి తీసుకున్నారు. కేవలం 5 ఏళ్ల వయసు ఉన్న వారి నుంచి 19 ఏళ్లు వయసు ఉన్న వారి వరకు ఈ అధ్యయనం లో పాల్గొన్నారని అన్నారు పరిశోధకులు. ఇందులోని ప్రతీ ఒక్కరి రక్త నమూనాలను సేకరించి క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్లు చెప్పారు.
ఈ పరిశోధన కూడా ఒకటి రెండు సార్లు కాకుండా ఏకంగా మూడు స్థాయిల్లో ఈ పరీక్షలు చేపట్టినట్లు పేర్కొన్నారు.కొవిడ్ నుంచి కోలుకున్న చాలా మంది పిల్లల్లో అంటే సుమారు 96 శాతం మందిలో యాంటీ బాడీలు 7 నెలల పాటు ఉన్నాయని తేలినట్లు చెప్పారు. దీనితో పాటు పిల్లలకు అవసరం అయిన వ్యాక్సిన్ లు తీసుకుంటే మరింత ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు పరిశోధకులు. పిల్లల్లో కొవిడ్ లక్షణాలు ఏ మాత్రం కనిపించిన వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని చెబుతున్నారు. కుటుంబ సభ్యులు కూడా సరైన జాగ్రత్తలు పాటించితే సులభంగా కొవిడ్ నుంచి బయటపడవచ్చు అని సూచిస్తున్నారు.