Begin typing your search above and press return to search.

కరోనా వ్యాక్సిన్ ప్రభావం ఎంత కాలం ఉంటుంది?

By:  Tupaki Desk   |   3 Jan 2021 5:30 PM GMT
కరోనా వ్యాక్సిన్ ప్రభావం ఎంత కాలం ఉంటుంది?
X
ప్రపంచాన్ని వణికించిన కరోనాకు చెక్ పెట్టే వ్యాక్సిన్ వచ్చేసింది. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మాత్రమే ప్రస్తుతం టీకా ఇస్తున్నారు. మన దేశంలో ఇంకా టీకా ఇచ్చే ప్రక్రియ షురూ కాలేదు. అయితే.. ఇప్పటికి రెండు వ్యాక్సిన్లకు అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చేశారు. అన్ని అనుకున్నట్లు సాగితే మరో వారం.. పది రోజుల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం షురూ కానుంది. దాదాపు నాలుగు కంపెనీలకు చెందిన వ్యాక్సిన్లను దేశ ప్రజలకు ఇవ్వనున్నారు.

ఇంతకాలం ఏ కరోనా గురించి భయపడ్డామో.. ఆ భయం నుంచి బయటపడేసే వ్యాక్సిన్ వచ్చేస్తున్న వేళ..కొత్త సందేహాలు వస్తున్నాయి. అందులో ఒకటి.. రెండు డోసులు వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత.. దాని ప్రభావం వ్యక్తి శరీరంలో ఎంత కాలం ఉంటుంది? అన్నదిప్పుడు డౌట్ గా మారింది. మిగిలిన వ్యాక్సిన్ల సంగతి ఎలా ఉన్నా.. మన వ్యాక్సిన్ (అదేనండి భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్) ప్రభావం ఎంత ఉంటుందన్నది ప్రశ్నగా మారింది.

దీనిపై నిపుణుల అభిప్రాయం ప్రకారం వ్యాక్సిన్ ప్రభావం ఆర్నెల్ల నుంచి ఏడాది పాటు క్రియాశీలకంగా ఉంటుందని చెబుతున్నారు. మరికొందరిలో కాస్త ఎక్కువ కాలం ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. దీంతో.. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఎంతకాలం ఇమ్యునిటీ ఉంటుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.