Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: కరోనాతో ఆ రెండు రాష్ట్రాలు లాక్ డౌన్

By:  Tupaki Desk   |   22 March 2020 9:33 AM IST
బ్రేకింగ్: కరోనాతో ఆ రెండు రాష్ట్రాలు లాక్ డౌన్
X
ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన జనతా కర్ఫ్యూతో ఈ ఆదివారం భారత దేశమంతా ఇళ్లకే పరిమితమైంది. కరోనా వైరస్ ను నియంత్రించేందుకు ప్రజలంతా స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు.

ఇక కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న రాజస్థాన్, మహారాష్ట్ర రాష్ట్రాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా రాజస్థాన్ సర్కార్ ఈనెల 22 నుంచి 31 వరకు రాష్ట్రాన్ని లాక్ డౌన్ చేస్తున్నట్టు ప్రకటించింది. దేశంలో లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్న తొలి రాష్ట్రంగా రాజస్థాన్ నిలిచింది. రాజస్థాన్ లో ఇప్పటికే 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు పది రోజుల పాటు రాజస్థాన్ రాష్ట్రం మొత్తం మూత పడుతుందని.. అత్యవసర సేవలు మాత్రమే ఉంటాయని సీఎం అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. ప్రజలకు ఆహార పొట్లాలు, గోధుమలు సరఫరా చేస్తామని.. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని రాజస్థాన్ సీఎం తెలిపారు.

రాజస్థాన్ లో లాక్ డౌన్ తో జాతీయ రహదారులను మూసివేస్తున్నారు. ప్రైవేటు ఆఫీసులు, మాల్స్, షాప్స్, ఫ్యాక్టరీలు మూసివేశారు. నిత్యవసర వస్తువులు దొరికే దుకాణాలు, మెడికల్ షాపులు, పాలవ్యాపారం మాత్రమే కొనసాగుతుందని తెలిపారు.

ఇక రాజస్థాన్ బాటలోనే పుదుచ్చేరి కూడా లాక్ డౌన్ ప్రకటించింది. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పుదుచ్చేరి సీఎం తెలిపారు. 31 వరకు పాండిచ్చేరి రాష్ట్రం కూడా లాక్ డౌన్ లోకి వెళ్లనుంది.

ఇక మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం దేశానికి వాణిజ్య రాజధాని అయిన ముంబై తోపాటు పెద్ద సిటీ నాగపూర్ ప్రాంతాల్లో లాక్ డౌన్ ప్రకటించింది. ముంబైలో లోకల్ ట్రైన్స్ అన్నింటిని బంద్ చేశారు. మార్చి 22న మొత్తం బంద్ అని తెలిపింది.