Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్ : బట్టలు ఉతుక్కుంటున్న సీఎం .. !

By:  Tupaki Desk   |   28 July 2020 3:00 PM IST
కరోనా ఎఫెక్ట్ : బట్టలు ఉతుక్కుంటున్న సీఎం .. !
X
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ ‌లోని చిరాయు ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆసుపత్రి నుండే అయన విధులు నిర్వర్తిస్తున్నారు. తన క్యాబినెట్ మంత్రులకు కొన్ని ఆదనపు బాధ్యతలను అప్పగించారు. కరోనా చికిత్స తీసుకుంటున్న రోజులు ఆయన ఎటువంటి ఫైళ్లపై సంతకం చేయనని తెలిపారు. ఇకపోతే , ఆయ‌న భార్య‌కు మాత్రం కరోనా ప‌రీక్ష‌ల్లో నెగిటివ్ వ‌చ్చింది. దేశంలో కరోనా భారిన పడిన సీఎం ఈయనే. ఇప్పటివరకు పలు రాష్ట్రాల్లో మంత్రులు ,ఎంపీలు , ఎమ్మెల్యేలు కరోనా భారిన పడ్డారు.

ప్ర‌స్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సీఎం శివ‌రాజ్ సింగ్, కరోనా చికిత్స గురించి వ‌ర్చువ‌ల్ వీడియో లో మాట్లాడారు. ‘తను కరోనా పాజిటివ్ పేషెంట్‌ ని కాబ‌ట్టి.. త‌న బ‌ట్ట‌లని తానే స్వయంగా ఉతుక్కుంటున్న‌ట్లు తెలిపారు. అయితే త‌న బట్ట‌లు తానే ఉతుక్కోవ‌డం వ‌ల్ల త‌న‌కు మంచే జరిగింది అని , త‌న చేతికి ఇటీవ‌ల శ‌స్త్ర చికిత్స జ‌రిగింద‌ని, ఎన్నో సార్లు ఫిజియోథెర‌పి చేయించినా పిడికిలి ప‌ట్టుకోవ‌డం కుదిరేది కాద‌న్నారు. కానీ, బట్టలు ఉతకడం ద్వారా తన చేయి సులువుగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇకపోతే రెండోసారి కూడా మ‌ధ్య ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్ సింగ్‌ కు క‌రోనా ప‌రీక్ష‌లు చేయ‌గా పాజిటివ్ గా వ‌చ్చిన‌ట్లు వైద్యులు వెల్లడించారు.