Begin typing your search above and press return to search.

కరోనా దెబ్బకు కాలుష్యం మటాష్..నిజమండీ బాబూ!

By:  Tupaki Desk   |   2 March 2020 12:30 AM GMT
కరోనా దెబ్బకు కాలుష్యం మటాష్..నిజమండీ బాబూ!
X
ఏంటేంటీ... ప్రపంచ దేశాలను ఓ రేంజిలో భయపెడుతున్న కరోనా వైరస్ కారణంగా కాలుష్యం తగ్గిందా? అయినా కరోనా వైరస్ కు కాలుష్యాన్ని తగ్గించే శక్తి ఉందా? ఆసక్తి రేపుతున్న ఈ విషయాల గురించి నమ్మలేని నిజాలను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా, యూరోపియన్ అంతరిక్ష సంస్థలు తాజాగా వెల్లడించాయి. కాలుష్యాన్ని ముఖ్యంగా వాయు కాలుష్యాన్ిన తగ్గించే శక్తి కరోనా వైరస్ కు లేకున్నా... కరోనా వైరస్ పుణ్యమా అని ఇప్పుడు చైనాలో కాలుష్యం స్థాయి అమాంతంగా తగ్గిపోయిందట. అది కూడా కరోనా వైరస్ ప్రబలిన వూహాన్ నుంచే ఈ కాలుష్య కారకాల తగ్టింపు మొదలైందట. ఇలా కరోనా దెబ్బకు కాలుష్యం తగ్గిపోయిన వైనానికి ఆసక్తికర లింకు ఉంది.

ప్రపంచ దేశాల్లో అతి చవకగా వస్తుత్పత్తి జరిగేది చైనాలోనే కదా. ముడి సరుకులతో పాటు కార్మిక శక్తి కూడా అతి తక్కువ ధరలకే లభ్యం అవుతున్న చైనాలో పారిశ్రామిక ఉత్పత్తి ఓ రేంజిలో సాగుతున్న విషయం మనకు తెలియనిదేమీ కాదు. పారిశ్రామిక ఉత్పత్తి అధికంగా ఉన్న నేపథ్యంలోనే చైనా... ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్న అమెరికా, బ్రిటన్, యూరోపియన్ దేశాలకు ప్రత్యామ్నాయంగా మారిపోయింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనా నిలిచినా.. ఆ సమస్య నుంచి అవలీలగా అభివృద్ధి సాధిస్తోంది. ఇక్కడిదాకా బాగానే ఉన్నా... పారిశ్రామిక ఉత్పత్తి అధికంగా ఉండటంలో చైనాలో ఆయా పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యాల స్థాయి కూడా అధికంగానే ఉంది. మొత్తంగా ఏ దేశంతో పోల్చినా కూడా చైనాలో కాలుష్యం ఎక్కువే.

తాజాగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కూడా చైనా నుంచే తన ప్రస్థానాన్ని మొదలెట్టింది. కరోనా దెబ్బకు చైనాకు వలస వెళ్లిన దాదాపుగా అన్ని దేశాల ప్రజలు బ్రతుకు జీవుడా అంటూ తిరుగుముఖం పట్టారు. చైనా ప్రజలు కూడా బిక్కుబిక్కుమంటూ పనులకు వెళ్లేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు.కరోనా నేపథ్యంలో ఆయా పరిశ్రమలు కూడా తమ ఉత్పత్తిని గణనీయంగా తగ్గించేశాయి. ఇంకేముంది... పారిశ్రామికోత్సత్తి అమాంతంగా తగ్గడంతో వస్తుత్పత్తి తగ్గిపోవడమే కాకుండా కాలుష్యం విడుదల కూడా భారీగా తగ్గిపోయింది. కరోనాకు రేరాఫ్ అడ్రెస్ గా నిలిచిని వూహాన్ లో అయితే ఈ పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే విషయాన్ని నిర్దారించేకునేందకు నాసా.. కరోనా ముందు నాటి ఫొటోలు, కరోనా తర్వాత ఫొటోలను తీసింది. ఈ ఫొటోల్లో చైనాలో కాలుష్యం భారీ స్థాయిలో తగ్గిపోయిందని తేటతెల్లమైపోయింది.