Begin typing your search above and press return to search.

రెండేళ్ల చిన్నారులకు కోవాగ్జిన్ టీకా.. ఎయిమ్స్‌ డైరెక్టర్‌ కీలక ప్రకటన

By:  Tupaki Desk   |   24 July 2021 8:30 AM GMT
రెండేళ్ల చిన్నారులకు కోవాగ్జిన్ టీకా.. ఎయిమ్స్‌ డైరెక్టర్‌ కీలక ప్రకటన
X
కరోనా వైరస్ మహమ్మారి దేశంలో సృష్టించిన కలకలం అంతా ఇంతా కాదు. ఇప్పటికే రెండు కరోనా వేవ్ లు దేశంలో కలకలం సృష్టించాయి. దేశానికీ మూడో వేవ్ ముప్పు కూడా ముంచుకొస్తోందని నిపుణులు చెప్తున్నారు. ఈ థర్డ్ వేవ్ ఎక్కువగా చిన్నారులపై ప్రభావం చూపించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలకు కూడా కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే 2 నుంచి 18 ఏళ్ల వారిపై కోవాక్జిన్ టీకాను పరీక్షిస్తున్నారు. 6 నుంచి 12 ఏళ్ల వయసున్న వారికి రెండో డోసు కూడా ఇచ్చారు.

తాజాగా 2 నుంచి 6 ఏళ్ల పిల్లలకు రెండు డోసు ట్రయల్స్ కు సిద్ధమౌతున్నారు. పిల్లలను కరోనా నుంచి రక్షించేది టీకానే అని అంటున్నారు నిపుణులు. అయితే ప్రస్తుతం ట్రయల్స్ నడుస్తున్నాయి. పరీక్షల్లో భాగంగా వారిని వయసుల వారీగా విభజించారు. దీంతో ఆగస్టు చివరి నాటికి అవన్నీ పూర్తయ్యే ఛాన్స్ ఉంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే సెప్టెంబర్ నాటికి చిన్నారులకు టీకా అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు.

చిన్నారులపై కోవాగ్జిన్ టీకా మంచి ఫలితాలనే ఇస్తుందని అంటున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఆంక్షలను సడలించారు. ఈ నేపథ్యంలోనే కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ ఆగస్టులోనే వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు ఎంత వీలుంటే అంత త్వరగా టీకా అందుబాటులోకి వస్తే బాగుంటుందని అందరూ కోరుకుంటున్నారు. అయితే, ఈ ప్రక్రియ ఆలస్యం అయ్యింది. ఇక, పిల్లలను వారి వయస్సు ప్రకారం వర్గాలుగా విభజించడం ద్వారా మూడు దశల్లో ట్రయల్స్‌ జరుగుతున్నాయి.. మొదటి ట్రయల్స్‌ 12-18 సంవత్సరాల వయస్సు వారిపై ప్రారంభించారు.. తర్వాత 6-12 సంవత్సరాలు.. ప్రస్తుతం 2-6 సంవత్సరాల వయస్సు గల వారిపై ట్రయల్స్‌లో జరుగుతున్నాయి.