Begin typing your search above and press return to search.

సైనిక యూనిఫాం ధరించిన మోడీ.. షాకిచ్చిన మోడీ

By:  Tupaki Desk   |   3 Feb 2022 10:07 PM IST
సైనిక యూనిఫాం ధరించిన మోడీ.. షాకిచ్చిన మోడీ
X
కశ్మీర్ పర్యటనకు వచ్చిన మోదీ భారత ఆర్మీ యూనిఫాం ధరించడంపై ఉత్తరప్రదేశ్ జిల్లా కోర్టు షాకిచ్చింది. ఏకంగా ప్రధానమంత్రి కార్యాలయానికి నోటీసులు జారీ చేసింది. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 140 ప్రకారం ఒక సైనికుడు, నావికుడు లేదా వైమానిక దళం సైనికులు మాత్రమే ఉపయోగించే దుస్తులు ధరించడం లేదా టోకెన్‌లను తీసుకెళ్లడం శిక్షార్హమైన నేరమని పేర్కొంటూ ప్రయాగ్‌రాజ్‌లోని కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత మోడీకి షాకిస్తూ ఈ నోటీసులు జారీ చేసింది.

క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 156(3) కింద దరఖాస్తును తరలించిన న్యాయవాది రాకేష్ నాథ్ పాండే వాదనలను విన్న జిల్లా న్యాయమూర్తి నళిన్ కుమార్ శ్రీవాస్తవ ఈ నోటీసు జారీ చేశారు. ఈ ఘటన కోర్టు పరిధిలో జరగలేదని, అధికార పరిధి ఉన్న మేజిస్ట్రేట్ ఈ విషయాన్ని విచారించవచ్చని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హరేంద్ర నాథ్ తిరస్కరించడంతో పాండే ఈ దరఖాస్తును మొదట దాఖలు చేశారు.

ప్రధాని మోదీ భారత ఆర్మీ యూనిఫాంలో చాలాసార్లు కనిపించారు. గత కొన్ని దీపావళినాడు సైనికులతో వేడుక చేసుకొని ఈ యూనిఫాం ధరించారు. ఇండియన్ ఆర్మీ యూనిఫాంలో కనిపించాడు. సైనిక కమాండర్ లాగా జవాన్లను ఉద్దేశించి మాట్లాడాడు. జవహర్‌లాల్ నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు మరే ఇతర ప్రధానమంత్రి ఆర్మీ యూనిఫాంలో బహిరంగంగా ఇంతవరకూ కనిపించలేదు. నియమం ప్రకారం.. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రధానమంత్రి ప్రపంచంలో మరెక్కడా సైనిక దుస్తులలో కనిపించరు.

కానీ మోడీ మాత్రం దేశభక్తిని అణువణువునా నింపుకొని సైనికులకు భరోసా కల్పించేందుకు.. సైనికుల్లో స్ఫూర్తి నింపేందుకు మోడీ ఇలా వారి యూనిఫాం ధరిస్తాడు. ఇదే క్రమంలోనే సవాల్ చేసిన పాకిస్తాన్, చైనా వారికి హెచ్చరికలు జారీ చేసేందుకు ఇలా దుస్తులు ధరిస్తారని బీజేపీ వాదులు అంటున్నారు.