Begin typing your search above and press return to search.

మాజీ కేంద్రమంత్రికి కోర్టు చురకలు

By:  Tupaki Desk   |   18 Feb 2021 9:00 AM IST
మాజీ కేంద్రమంత్రికి కోర్టు చురకలు
X
కేంద్రమాజీ మంత్రి ఎంజే అక్బర్ కు చుక్కెదురైంది. పరువునష్టం కేసులో జర్నలిస్ట్ ప్రియా రమణిని నిర్ధోషిగా విడుదల చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ క్రమంలోనే కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

2018లో మీటూ ఉద్యమం జరిగిన సమయంలో జర్నలిస్ట్ ప్రియా రమణి.. మాజీ కేంద్రమంత్రి ఎంజే అక్బర్ పై లైంగిక ఆరోపణలు చేసింది. కొన్ని దశాబ్ధాల క్రితం తనపై లైంగికంగా అనుచితంగా ఎంజే అక్బర్ ప్రవర్తించారని ఆరోపించింది. ఈ క్రమంలోనే అక్బర్ 2018 అక్టోబర్ 15న రమణిపై పరువు నష్టం దావా దాఖలు చేశారు. రమణి ఆరోపణల వల్లే అక్బర్ 2018 అక్టోబర్ లో కేంద్రమంత్రి పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది.

తాజాగా అక్బర్ పరువు నష్టం దావా కేసులో వాదనలు పూర్తయ్యాయి. దీనిపై తీర్పు బుధవారం వెలువడింది. ప్రియా రమణి నిర్ధోషి అని న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ఈ సందర్భంగా రామాయణం, మహాభారతం పుట్టిన చోట మహిళలకు గౌరవం దక్కకపోవడం సిగ్గుచేటు అని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళల గౌరవ, మర్యాదలను కాపాడాలని తెలిపింది.

ఎంజే అక్బర్ నిష్కళంక చరితుడు కాదనే వాదనను అంగీకరించింది.లైంగిక వేధింపుల గురించి చాలా మంది మహిళలలు మాట్లాడబోరని.. దీనికి కారణం ఆమెకు కూడా ఓ కుటుంబం ఉండటమేనని.. అందుకే ప్రియా రమణి ఆరోపణలతో ఏకభీవిస్తున్నట్టు కోర్టు తెలిపి ఎంజే అక్బర్ పై హితవు పలికింది.