Begin typing your search above and press return to search.

జయ ఆస్తులకే కాదు.. బకాయిలకూ వారసులే...

By:  Tupaki Desk   |   7 Dec 2021 10:30 AM GMT
జయ ఆస్తులకే కాదు.. బకాయిలకూ వారసులే...
X
ఆమె ఎవరి పేరిటా వీలునామా రాయలేదు.. ఆస్తులెక్కడున్నాయో తెలియదు.. ఆమె కూడా ఎవరికీ చెప్పినట్టు తెలియదు.. ఏమైనా విషయాలు తెలిసినది ఎవరైనా ఉన్నారంటే.. అది నెచ్చెలి ఒక్కరే. తదనంతర పరిణామాల్లో ఆమె కూడా జైలుపాలయ్యి, వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ మధ్యలో ఆమె ఆస్తుల పంచాయతీ.. సర్కారు నుంచి కోర్టుకు చేరింది. ఇటీవలే కోర్టు కీలకమైన తీర్పు ఇవ్వడంతో ఓ కొలిక్కి వచ్చింది. అయితే, అంతలోనే అనుకోని మలుపు... ఇదంతా తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆస్తుల గురించి.

జయకు వేలాది కోట్ల ఆస్తులున్న సంగతి అందరికీ తెలిసిందే. అవి ఆమె సినిమా సంపాదనతో కొనుక్కున్నవా? రాజకీయాల్లో అక్రమంగా సంపాదించినవా? అన్నది కాసేపు పక్కనపెడదాం.

ఇప్పటికి కూడా ఆమెకున్న ఆస్తులు ఎన్ని అనే విషయంలో ఎవరకీ సరైన సమాచారం లేదు. జయతో ఉన్న సుదీర్ఘమైన అనుబంధం కారణంగా ఆమె ఆస్తుల విషయం శశికళకు తెలిసుంటుందని అందరు అనుకుంటున్నారు.

అసలు జయ మరణానంతరం ఎవరికి చెందాలో కూడా తెలియని పరిస్థితుల్లో చిక్కాయి.

ఆస్తులపై పెద్ద వివాదం నడిచిన విషయం తెలిసిందే. కాగా, ఇటీవల జయ ఆస్తులు ఆమె వారసులకే (అంటే మేనకోడలు, మేన కోడలు) దక్కాలంటూ మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది. తాజాగా ఆస్తులే కాదు బకాయిలు కూడా వారసులు తీర్చాల్సిందే అని స్పష్టం చేసింది. మేనత్త ఆస్తులు తమకే రావాలని పట్టుబట్టిన మేనల్లుడు దీపక్, మేనకోడలు దీపలకు హైకోర్టు ఈ విధంగా షాకి ఇచ్చింది.

ఎక్కడున్నాయో...? ఎన్ని ఉన్నాయో..?

జయ ఆస్తుల విషయమై ఆమె ప్రాణ స్నేహితురాలు శశికళ కూడా ఇప్పటివరకు ఎక్కడా నోరిప్పలేదు. దాంతో చెన్నైలోని పొయెస్ గార్డెన్ లో జయ నివాసం వేదనిలయం లాంటివి ఒకటిరెండు ఆస్తులు తప్ప ఇంకేమీ కనిపించటం లేదు. కాగా, ఈ వేద నిలయం కూడా జయ సొంత సంపాదనతో కొన్నది కాదని.. జయ తల్లి కొనుగోలు చేశారనే ప్రచారం ఉంది.

అయితే జయ మరణం తర్వాత ఊటిలో ఓ ఫామ్ హౌస్ ఉందని, కొడనాడులో టీ ఎస్టేట్ ఉందనే విషయాలు బయటపడ్డాయి. మొత్తం మీద ఆస్తుల వ్యవహారం ఇంకా వివాదాస్పదంగాను, సీక్రెట్ గానే ఉండిపోయాయి. ఈ నేధ్యంలోనే వేదనిలయాన్ని సొంతం చేసుకునేందుకు శశికళ ప్రయత్నాలు చేశారు. ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్ మధ్య ఆస్తుల కోసం వివాదం మొదలైంది.

చిక్కువీడింది అనుకుంటుండగా..

జయ చనిపోయి సరిగ్గా ఈ డిసెండరుకు ఐదేళ్లు. ఆస్తుల వివాదం కోర్టుకు చేరటంతో సంవత్సరాల తరబడి విచారణ జరిగింది. అప్పటినుంచి రగులుతున్నవివాదానికి కొన్ని రోజుల క్రితమే ముగింపు దక్కింది. జయలలిత ఆస్తులు, అప్పులపై ఎలాంటి విల్లు రాయలేదు కాబట్టి మేనల్లుడు, మేనకోడలే చట్టబద్దమైన వారసులుగా హైకోర్టు గుర్తించింది.

వెంటనే వేదనిలయం ఇంటితో పాటు జయ పేరుతో ఉన్న ఆస్తులన్నింటినీ దీపక్, దీపల సొంతం చేయాలంటు హైకోర్టు ఆదేశాలిచ్చింది. కథ ముగిసింది అనుకుంటున్న సమయంలో హఠాత్తుగా వీళ్ళద్దరిపైన హైకోర్టు పెద్ద పిడుగు పడేసింది. ఆస్తులు తీసుకోవటమే కాదని జయలలిత కట్టాల్సిన బకాయిలను కూడా మీరే కట్టాలంటు గట్టి షాక్ ఇచ్చింది. జయలలిత కట్టాల్సిన బకాయిలను మేనల్లుడు, మేనకోడలు దగ్గర నుండే రాబట్టుకోవాలని ఐటీ శాఖను హైకోర్టు ఆదేశించింది.

ఆస్తులే అంతుంటే.. బకాయిలూ భారీగానే ఉన్నట్లు

జయలలిత ఆస్తుల విలువెంత, ఐటీ శాఖకు చెల్లించాల్సిన బకాయిలెంత అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ అయిపోయింది. మార్కెట్ రేట్ల ప్రకారం వీళ్ళకు దక్కిన ఆస్తుల విలువ ఎంతైనా ఉండచ్చు. కానీ జయలలిత ఐటి శాఖకు కట్టాల్సిన బకాయిలే కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. అంటే మేనత్త జయలలిత కట్టాల్సిన బకాయిలను వీళ్ళిద్దరు చెల్లించాలంటే నిజానికి వీళ్ళకి అంత స్తోమత లేదనే అనిపిస్తోంది.

ఎందుకంటే వీరి ఆర్థిక నేపథ్యం చాలామందికి తెలీదు. ఎంతటి ఆస్తిపరులైనా కోట్ల రూపాయల్లో ఐటి బకాయిలు చెల్లించేంత అయితే ఉండదనే అనుకుంటున్నారు. అవి చెల్లించాలంటే చేతిలో ఉన్న ఆస్తులను అమ్ముకోక తప్పేట్లు లేదు. మరోవైపు బినామీ పేర్లతో కూడా తమ మేనత్త చాలా ఆస్తులను పోగేసినట్లు వీళ్ళు అనుమానిస్తున్నారు.

ఎందుకంటే ఇదే పద్దతిలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జయలలిత సంపాదించినట్లు జరుగుతున్న ప్రచారం అందరికీ తెలిసిందే. ఇపుడు వాటి సంగతి దేవుడెరుగు ముందు ఐటీకి కోట్ల రూపాయల బకాయిలు ఎలా చెల్లించాలో తెలీక లబో దిబో అంటున్నారు.