Begin typing your search above and press return to search.
పుట్టుకకూ బ్రేకులేసిన కరోనా.. బిడ్డల్ని కనడమూ వాయిదా వేస్తున్న జంటలు
By: Tupaki Desk | 6 Oct 2020 7:00 AM ISTకరోనా అన్ని విషయాల్లో సమస్యగా మారింది. చివరికి పిల్లలు కనే విషయంలో కూడా దాని ప్రభావం పడుతోంది. ఈ పరిస్థితులలో, ఇన్ని సమస్యలు ఎదుర్కొంటూ పిల్లల్ని కనడం ఎందుకని యువ దంపతులు బిడ్డలు కనడాన్ని వాయిదా వేస్తున్నారు. అందుకు వారు చెబుతున్న కారణాలు వాస్తవమే అనిపిస్తున్నాయి. ఒకసారి గర్భం దాలిస్తే తొమ్మిది నెలల వరకూ.. బిడ్డను కనేవరకూ ఎంతో జాగ్రతగా ఉండాలి. ముందు గర్భిణి అవగానే ప్రత్యేకంగా కొన్ని స్కానింగ్ లు చేయించుకోవాలి. పుట్టే బిడ్డ ఆరోగ్యంగానే ఉందా..అవయవాల్లో ఏమైనా లోపం ఉందా అని పరీక్షలు చేయించు కోవాల్సి ఉంటుంది.
ప్రతి నెలా స్కానింగ్ లతో పాటు వైద్యుల సలహాలు తీసుకుంటూ ఉండాలి. ఎప్పటి కప్పుడు ల్యాబ్ లకు వెళ్లి పరీక్షలు చేయించు కోవాలి. కరోనా వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు చూపించు కోవడానికి కూడా వైద్యులు దొరకడం లేదు. చాలా నగరాల్లో హాస్పిటళ్ళు మూసివేసారు. ఇప్పుడు ఈ కరోనా కాలంలో గర్భం దాలిస్తే ఇవన్నీ ఎలా ఫేస్ చేయాలని ఎందరో యువ దంపతులు పిల్లల్ని కనడం వాయిదా వేస్తున్నారు. ఒకవేళ గర్భం దాల్చినా.. ప్రతి సారి కరోనా వల్ల బయటకు వెళ్ళలేని పరిస్థితి. ప్రయాణ సమయంలో ఇతరుల పక్కన కూర్చొని రిస్క్ చేసి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆస్పత్రికి వచ్చేవారికి వ్యాధి ఉంటే అది అంటుకునే అవకాశం ఉంటుంది. కొంతమంది వైద్యులు టెస్ట్ కు వెళ్ళిన ప్రతి సారి ముందుగా కరోనా లేదు ..అనే ఒక నిర్ధారణ పత్రం తీసుకుని వస్తేనే వైద్యం చేస్తామని అంటున్నారు. ఇలా ఆస్పత్రికి వెళ్ళే ప్రతి సారి ముందుగా కరోనా టెస్టు చేయించు కోవడం అసాధ్యం. పైగా గర్భిణిగా ఉన్న సమయంలో కరోనా వస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా సమస్యలు రావడం వల్ల పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుందో లేదో నన్న సందేహం చాలా మందిలో ఉంది.
అన్నింటికన్నా ముఖ్య మైనది డెలివరీ సమయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా తల్లీ బిడ్డకు కరోనా సోకితే చాలా ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొంత మంది డెలివరీ సమయంలో కరోనా సోకి మరణించిన సంఘటనలు ఉన్నాయి. ఇన్ని సమస్యలతో పాటు కరోనా సమయంలో వైద్యం చాలా ఖరీదుగా మారింది.ఇవన్నీ అలోచించి యువదంపతులు, రెండు ,మూడేళ్ళు పిల్లల్ని కనడం వాయిదా వేసినా పర్వాలేదు అనుకుంటున్న వారు బిడ్డల్ని కనడం వాయిదా వేస్తున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాగా కరోనా కంటే ముందే గర్భం దాల్చిన వారు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కరోనా సోకితే ఎక్కడ బిడ్డపై ఆ ప్రభావం పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. తల్లి అయ్యామన్న మాతృత్వపు ఆనందాన్నికూడా పొందలేని పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.
కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి 9 నెలల సమయంలో ప్రపంచంలోనే అత్యధిక జననాలు (రెండు కోట్ల పది లక్షలు) భారత్‌లో ఉంటాయని యూనిసెఫ్ అంచనా. చైనాలో (ఒక కోటి 35 లక్షలు), నైజీరియా (60 లక్షల నలభై వేలు), పాకిస్తాన్ (50 లక్షలు), ఇండోనేసియాలో (40 లక్షలు) జననాలు నమోదు కావొచ్చని యూనిసెఫ్ పేర్కొంది. మొదటి నుంచి శిశు మరణాల శాతం ఎక్కువగా ఉన్న ఈ దేశాల్లో కరోనాతో మరణాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని తెలిపింది. కరోనా లేని సమయంలోనే ప్రపంచ వ్యాప్తంగా ఏటా సుమారు 2.8 మిలియన్ మాతా శిశు మరణాలు జరుగుతున్నాయి. ఇక కరోనా కాలంలో చాలా జాగ్రతలు తీసుకుంటే ఈ మరణాలను తగ్గించవచ్చని యూనిసెఫ్ కూడా చెబుతోంది.