Begin typing your search above and press return to search.

జీహెచ్ఎంసీలో సత్తా చాటిన దంపతులు

By:  Tupaki Desk   |   6 Dec 2020 3:16 PM IST
జీహెచ్ఎంసీలో సత్తా చాటిన దంపతులు
X
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకున్నాయి. గెలవాల్సిన వారు ఓడారు.. ఓడుతామనుకున్న వారు గెలిచారు. టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థులు సైతం ఓడిపోయారు. బీజేపీ దెబ్బకు టీఆర్ఎస్ సిట్టింగ్ లు సగం మంది కొట్టుకుపోయారు. అధికార బలం కూడా వారిని కాపాడలేకపోయింది.

జీహెచ్ఎంసీలో అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే భార్యలు, మంత్రుల బంధువులు సైతం ఓడిపోయారు. ఒక జంట మాత్రం హవా చాటింది. 2016లో కార్పొరేటర్లుగా గెలిచిన దంపతులు ఇంత గడ్డు పరిస్థితులను తట్టుకొని రెండోసారి గెలవడం విశేషం. రెండు డివిజన్లలో వరుసగా రెండోసారి విజయం సాధించారు.

మాదాపూర్ నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన జగదీశ్వర్ గౌడ్ విజయం సాధించగా.. ఆయన భార్య పూజిత హఫీజ్ పేట నుంచి కార్పొరేటర్ గా గెలుపొందింది.

మరోసారి ఇద్దరూ కూడా అవే స్థానాల నుంచి టీఆర్ఎస్ తరుఫున పోటీచేసి గెలవడం విశేషం. ఇక మంత్రి తలసాని బంధువు రాంగోపాల్ పేట డివిజన్ నుంచి పోటీచేసి ఓడిపోయాడు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య కూడా కవాడిగూడలో ఓడిపోయింది. ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి భార్య సైతం ఓడిపోయారు. ఇలా అందరూ ఓడిపోయినా ఈ టీఆర్ఎస్ జంట దంపతులు మాత్రం గెలవడం విశేషం.