Begin typing your search above and press return to search.
సుప్రీంకోర్టు వద్ద నిప్పంటించుకున్న జంట .. ఒకరు మృతి !
By: Tupaki Desk | 21 Aug 2021 6:00 PM ISTసుప్రీంకోర్టు ప్రధాన ద్వారం గేట్ నంబర్ డి వద్దకు సోమవారం ఉదయం ఓ జంట వచ్చారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. వారి వద్ద ఎలాంటి ధ్రువపత్రాలు లేకపోవడంతో లోపలికి అనుమతించబోమని సెక్యూరిటీ సిబ్బంది చెప్పారు. వారిద్దరు పెద్దగా అరుస్తూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకున్నారు. దీనితో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలు ఆర్పేసి వారిద్దరిని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనలో సుప్రీంకోర్టు ఆవరణలో అలజడి నెలకొంది. న్యాయవాదులతో పాటు, ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
సుప్రీంకోర్టు బయట ఓ మహిళతో బాటు నిప్పంటించుకున్న 27 ఏళ్ళ యువకుడు, రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మరణించాడు. ఇతనికి 65 శాతం గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఇతని వెంట ఉన్న 24 ఏళ్ళ యువతికి 85 శాతం గాయాలయ్యాయని, ఆమె చికిత్స పొందుతోందని వారు చెప్పారు. యూపీలోని ఘాజీపూర్ కు చెందిన ఈ యువతిపై 2019 లో బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన ఎంపీ అతుల్ రాయ్ అత్యాచారం చేశాడని, ఈ నేరానికి గాను గత రెండేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడని వారు చెప్పారు.
2019 లో తాను అతుల్ రాయ్ పై కేసు పెట్టినప్పటి నుంచి కొందరు పోలీసు అధికారుల నుంచి, ఇతరుల నుంచి కూడా బెదిరింపులు అందాయని.. నిందితుడి తరఫు వారు తనను తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని భయపెడుతూ వచ్చారని ఈ మహిళ తెలిపింది. యూపీ లోని ఓ లోకల్ కోర్టు తనకు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసిందని, జడ్జి నుంచి సమన్లు అందాయని ఈమె పేర్కొంది. తనకు ప్రాణహాని ఉన్నందున తన కేసును అలహాబాద్ కోర్టు నుంచి ఢిల్లీ కోర్టుకు మార్చాలని ఈమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. పైగా ఈ మహిళ ఫోర్జరీకి పాల్పడిందంటూ నిందితుడు రాయ్ సోదరుడు కూడా ఈమెపై కేసు పెట్టినట్టు తెలిసిందన్నారు. దాంతో వారణాసి లోని కోర్టు ఈమెకు నాన్, బెయిలబుల్ వారంట్ జారీ చేసిందన్నారు.