Begin typing your search above and press return to search.

ఏపీ సచివాలయం వద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం...కారణం ఏంటంటే?

By:  Tupaki Desk   |   27 Feb 2021 5:20 PM IST
ఏపీ సచివాలయం వద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం...కారణం ఏంటంటే?
X
ఆంధ్రప్రదేశ్ సచివాలయం వద్ద ఈ రోజు ఉద్రిక్తత ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో కలిసి దంపతులు అమరావతిలోని ఏపీ సెక్రటేరియట్ వద్ద ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. ఆత్మహత్యకు యత్నించిన దంపతులను నెల్లూరు జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. పెట్రోల్ పోసుకుని అంటించుకునేందుకు యత్నించారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు వారిని అడ్డుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే .. శనివారం నెల్లూరు జిల్లాలకు చెందిన దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి సచివాలయం వద్దకు చేరుకున్నారు. వారి వెంట పెట్రోల్ డబ్బా కూడా తీసుకొని వచ్చారు. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సచివాలయం వద్దకు చేరుకున్నారు. ఆత్మహత్యకు యత్నించిన దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం వారిని అక్కడి నుంచి తరలించారు. ప్రస్తుతం ఆత్మహత్యకు యత్నించిన దంపతులను పోలీసులు విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. నెల్లూరు జిల్లా దత్తలూరు ఎమ్మార్వో చంద్రశేఖర్ తమను మోసం చేశాడని ఆత్మహత్యకు యత్నించిన దంపతులు ఆరోపించారు. పోలం ఆన్‌ లైన్ చేస్తా అని నమ్మించి మోసం చేశాడని చెప్పారు. ఇందుకు తమ వద్ద నుంచి కోటి రూపాయలకు పైగా డబ్బులు తీసుకున్నాడని వాపోయారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.