Begin typing your search above and press return to search.

ఆర్మీ కొత్త చీఫ్ ఎంట్రీతో దేశంలో మరెప్పుడూ లేని కొత్త కాంబినేషన్

By:  Tupaki Desk   |   2 May 2022 8:46 AM IST
ఆర్మీ కొత్త చీఫ్ ఎంట్రీతో దేశంలో మరెప్పుడూ లేని కొత్త కాంబినేషన్
X
నిజంగా నిజం. అనుకోకుండా చోటు చేసుకునే కొన్ని ఉదంతాలు రియల్ లైఫ్ లో సాధ్యమా అన్నట్లుగా అనిపిస్తాయి. ఎంతో అరుదుగా చోటు చేసుకునే ఇలాంటివి తాజాగా మన దేశంలో చోటు చేసుకుంది. రెండురోజుల క్రితం కొత్త ఆర్మీచీఫ్ ను కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.

తాజాగా ఆయన ఎంట్రీతో దేశంలో మరెప్పుడూ లేని రీతిలో సరికొత్త కాంబినేషన్ ఒకటి తెర మీదకు వచ్చింది. దేశ రక్షణలో అత్యంత కీలకమైన త్రివిధ దళాలకు చెందిన ముగ్గురు అధినేతలు ఇప్పుడు ఒకే బ్యాచ్ మేట్లు కావటం విశేషం.

ఈ ముగ్గురు దళాధిపతులు నేషనల్ డిఫెన్స్ అకాడమీ 61వ బ్యాచ్ లో కలిసి చదువుకున్న వారే కావటం గమనార్హం. ఇలాంటి రేర్ కాంబినేషన్ చాలా అరుదుగా చోటు చేసుకుంటుదని చెప్పాలి. నేవీ.. ఎయిర్ పోర్సు చీఫ్ లు ఇద్దరూ తన క్లాస్ మేట్లేనని జనరల్ పాండే రివీల్ చేయటంతో ఈ అరుదైన కాంబినేషన్ గురించిన విషయం తాజాగా బయటకు వచ్చింది.

అరుదైన సందర్భాల్లో తప్పించి ఇలాంటి కాంబినేషన్ సాధ్యం కాదు. యాదృశ్చికంగా చోటు చేసుకున్న ఈ కాంబినేషన్ లో దేశ రక్షణ కొత్త పుంతలు తొక్కాలని ఆశిద్దాం. ఇదిలా ఉంటే.. తాజాగా ఆర్మీ చీఫ్ గా ఎంపికైన జనరల్ మనోజ్ పాండే సౌత్ బ్లాక్ లో గౌరవవందనం స్వీకరించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వటం గమనార్హం. చైనాతో సరిహద్దు వెంబడి అంగుళం భూభాగాన్ని కూడా పొరుగు దేశానికి వదలబోమని ఆయన స్పష్టం చేశారు.

యథాతథ స్థితిని మార్చేందుకు జరిగే ప్రయత్నాల్ని ధీటుగా తిప్పి కొడతామని ఆయన స్పష్టం చేశారు. ఎంట్రీలోనే చైనాకు వార్నింగ్ ఇచ్చేసిన ఆయన రానున్న రోజుల్లో మరేం చేస్తారో చూడాలి.