Begin typing your search above and press return to search.

ఆశ్చ‌ర్యంః దేశంలో లాక్ డౌన్ పెడితే.. జ‌నాభా త‌గ్గిపోయింది!

By:  Tupaki Desk   |   19 May 2021 4:30 PM GMT
ఆశ్చ‌ర్యంః దేశంలో లాక్ డౌన్ పెడితే.. జ‌నాభా త‌గ్గిపోయింది!
X
లాక్ డౌన్ విధిస్తే ఏం జ‌రుగుతుంది? మొగుడు పెళ్లాలు నాలుగు గోడల మధ్యనే ఉంటారు స‌ర‌స స‌ల్లాపాల‌కు కావాల్సినంత టైం దొరుకుతుంది. దాని వ‌ల్ల ఏం జరగాలి? స‌హ‌జంగానైతే ప్రొడక్షన్ పెర‌గాలి క‌దా.. కానీ.. అమెరికాలో మాత్రం ఇందుకు రివ‌ర్స్ గా జ‌రిగింది. గ‌తేడాది విధించిన లాక్ డౌన్ కాలంలో జ‌నాభా రేటు త‌గ్గిపోవ‌డం విస్మ‌య ప‌రుస్తోంది.

ప‌క్కా లెక్క‌లు ఈ విష‌యాన్ని నిరూపిస్తున్నాయి. క‌రోనా సెకండ్ వేవ్ అమెరికాలో ఎంత‌టి ప్ర‌భావం చూపిందో అంద‌రికీ తెలిసిందే. దీంతో.. ఆ దేశంలో కూడా లాక్ డౌన్ విధించారు. అయితే.. 2020లో ఆ దేశంలో సంతానోత్ప‌త్తి రేటు ఏకంగా 4 శాతం త‌గ్గిపోవ‌డం గ‌మనార్హం. 2019లో అమెరికాలో మొత్తం 37.5 ల‌క్ష‌ల మంది పిల్ల‌లు జ‌న్మించారు. కానీ.. 2022లో ఈ సంఖ్య 36 ల‌క్ష‌ల‌కు ప‌డిపోవ‌డం గ‌మ‌నార్హం. అమెరికాలోని సెంట‌ర్స్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) ఈ డేటాను విడుద‌ల చేసింది.

వాస్త‌వానికి లాక్ డౌన్ కార‌ణంగా సంతానోత్ప‌త్తి పెరుగుతుంద‌ని ఆ దేశం అంచ‌నా వేసింది. కానీ.. దానికి రివ‌ర్స్ లో త‌గ్గిపోవ‌డంతో ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తోంది. అయితే.. దీనికి చాలా కార‌ణాలు ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు. 1930లో దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ దెబ్బ‌తిన్న స‌మ‌యంలోనూ ఇదే విధంగా జ‌రిగింద‌ని గుర్తు చేస్తున్నారు. ప‌రిస్థితులు మెరుగు ప‌డిన త‌ర్వాత మ‌ళ్లీ గాడిన ప‌డింద‌ని చెబుతున్నారు. ఇప్పుడు కూడా అదే జ‌రుగుతుంద‌ని అంటున్నారు.