Begin typing your search above and press return to search.
ఎయిర్పోర్ట్ లేని దేశాలెన్నో ... మరి అక్కడికి ఎలా వెళ్లాలంటే..!
By: Tupaki Desk | 15 Dec 2020 6:00 AM ISTప్రపంచంలోని ఇప్పటికీ ఎయిర్పోర్ట్ లేని దేశాలు అనేకం ఉన్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. మధ్యతరగతి ప్రజలు కూడా విమానాల్లో తిరిగే రోజులేవి. ఓ నగరం నుంచి మరో నగరానికి, ఓ దేశం నుంచి మరో దేశానికి ప్రయాణించేందుకు విమానాలనే వాడుతున్నారు. బాగా డబ్బున్న వాళ్లు అయితే కార్లు, బైక్ లు కొన్నంత సులభంగా విమానాలను కూడా కొంటున్నారు. ఫ్యామిలీ తో కలసి టూర్లకు కూడా వెళ్తున్నారు. ఒకప్పుడు ధనికులకు మాత్రమే పరిమితమైన విమానాలు ఇప్పుడు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇప్పటికీ కొన్ని దేశాలకు విమానాశ్రయాలు లేవు. నిజానికి అవి పేదదేశాలు ఏమీ కావు. ధనికదేశాలే కానీ వివిధ కారణాల వల్ల అక్కడ విమానాశ్రయాలు లేవు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.
వాటికన్ సిటీ
ప్రపంచంలో విస్తీర్ణంలో అతిచిన్న దేశమది. ఈ దేశంలో కేవలం 1000 మంది మాత్రమే నివసిస్తారు. క్రైస్తవ మతగురువు పోప్ ఈ దేశానికి అధినేత. అయితే ఇక్కడ విమానాశ్రయం లేదు. ఇటలీ దేశంలోని ఓ చిన్న భూభాగంగా ఈ దేశం ఉంది. ఇక్కడికి వెళ్లాలంటే రోమ్‌లోని సియాంపినో ఎయిర్‌పోర్ట్‌లో దిగి రోడ్డు మార్గంలో వెళ్లాల్సిందే. అంత పేరున్న వాటికన్ సిటీకి ఎయిర్ పోర్టు లేకపోవడం ఆశ్చర్యకరం.
అండొర్రా
ఇది కూడా యూరప్‌లోనే ఉంది. అతి చిన్న అందమైన దేశం. ఇక్కడంతా కొండలు, లోయలు మాత్రమే ఉంటాయి. ప్రకృతి ప్రేమికులకు ఇది స్వర్గధామంలా కనిపిస్తుంది. ఈ దేశంలోనూ విమానాశ్రయం లేదు. స్పెయిన్ లేదా ఫ్రాన్స్‌లో దిగి ఇక్కడికి రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. ఈ దేశానికి ఆదాయం కేవలం పర్యాటకుల ద్వారానే వస్తుంది.
శాన్ మారినో
ఇటలీ భూభాగంలో ఉన్న ఈ దేశంలో దాదాపు 40 వేల జనాభా ఉంటుంది. ఇక్కడికి చేరుకోవాలంటే రోడ్డు మార్గమే తప్ప వేరే గత్యంతరం లేదు. ఈ దేశంలో కొన్ని హెలిప్యాడ్లు ఉంటాయి. అవి కూడా కేవలం వైద్యపరమైన అవసరాలకే వాడతారు.
మొనాకో
మెడిటెర్రనియన్ సముద్ర తీరప్రాంతంలో ఉన్న ఈ దేశం జనభా కేవలం 40 వేలు. ఫ్రాన్స్‌కు ఆనుకొని ఈ దేశం ఉంటుంది. ఇక్కడికి వెళ్లాలంటే ఫ్రాన్స్‌లోని నైస్ కొట్ డిఅజుర్ ఎయిర్పోర్టలో దిగి రోడ్డుమార్గంలో వెళ్లాల్సిందే. అక్కడి నుంచి కేవలం అరగంట ప్రయాణమే.
లిచెన్‌స్టైన్
యూరప్‌లోని మరో చిన్న లిచెన్స్టన్ ఆస్ట్రియా, స్విట్టర్లాండ్తో సరిహద్దులను పంచుకొని ఈ దేశం ఉంది. అక్కడ కూడా ఎయిర్పోర్ట్ లేదు. స్విట్జర్ల్యాండ్ లేదా ఆస్ట్రియాలో దిగి ఇక్కడికి వెళ్లాల్సి ఉంటుంది.