Begin typing your search above and press return to search.

ఇప్పటికి ఈ దేశాల్లోని వారికి కరోనా అంటే తెలీదట

By:  Tupaki Desk   |   19 April 2020 5:23 AM GMT
ఇప్పటికి ఈ దేశాల్లోని వారికి కరోనా అంటే తెలీదట
X
వినేందుకు విచిత్రంగా ఉన్నా ఇది నిజం. యావత్ ప్రపంచం కరోనా దెబ్బకు అతలాకుతలమైపోతున్నాయి. దాన్ని ఎలా కట్టడి చేయాలో అర్థం కాక ప్రభుత్వాలు కిందామీద పడుతున్నాయి. దేశాలకు దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోతున్నాయి. దేశాల ఆర్థిక వ్యవస్థలన్ని కుప్పకూలిపోతున్నాయి. మొత్తంగా ప్రపంచమే తిరుగోమన బాట పట్టిన దుస్థితి. ఈ వైరస్ ను ఎలా కట్టడి చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్న దేశాలు ఒకవైపు ఉంటే.. మరోవైపు.. కొన్ని దేశాల వారికి నేటికి కరోనా అంటే ఏమిటి? దాని తీవ్రత ఎంత ఉంటుందన్న విషయమే తెలీదని చెబుతున్నారు.

కరోనాను నియంత్రించలేక ఇబ్బంది పడుతున్న దేశాలు 200కు పైనే ఉండగా.. కొన్ని దేశాల్లో కరోనా ఉనికే లేకపోవటం గమనార్హం. కరోనా వైరస్ వెళ్లని దేశాలు కొన్ని ఉన్నాయి ఈ భూమి మీద. అయితే.. ఇలాంటి దేశాలన్ని దీవులుగానూ.. సముద్రంలో ఉండటంతో ఈ మాయదారి వైరస్ అక్కడి వరకూ వెళ్లలేదు. అంతర్జాతీయ పర్యాటకుల తాకిడి తక్కువగా ఉండే ఈ దేశాలకు కరోనా మకిలి పట్టలేదు. లక్కీ ఏమంటే.. ఈ దేశాలకు చెందిన వారు ప్రాశ్చాత్య దేశాలకు వెళ్లకపోవటం కూడా ఈ దేశాలకు వరంగా మారింది.

నేటికి కరోనా ఉనికి లేని దేశాల విషయానికి వస్తే..

% ఉత్తర కొరియా
% పాలావూ
% నౌరూ
% మైక్రోనేషియా
% వనూవాతూ
% తువాలు
% తుర్కెమెనిస్థాన్
% టోంగా
% తజికిస్థాన్
% సోలోమన్ ఐలాండ్స్
% సావో టోమ్ అండ్ ప్రిన్సిపీ
% సమోవా
% కోమోరస్
% కిరిబాతి
% లిసోతో
% మార్షల్ ఐలాండ్స్
% మైక్రోనేషియా