Begin typing your search above and press return to search.

సోము సీటుకు కౌంట్ డౌన్...?

By:  Tupaki Desk   |   1 April 2022 8:30 AM GMT
సోము సీటుకు కౌంట్ డౌన్...?
X
ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పదవి అంటే ఒక మోజు క్రేజూ ఉంటుంది. ఎందుకంటే ఆ పార్టీ జాతీయ స్థాయిలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. దాంతో సౌండ్ పార్టీగా చూడాలి. ఏపీలో బలం లేకపోతేనేమి కేంద్రంలో బీజేపీ పటిష్టంగా ఉంది. రెండు సార్లు ఇప్పటికి గెలిచింది. హ్యాట్రిక్ విజయం కూడా వీలు అయ్యేలా సీన్ ఇప్పటికి ఉంది. అందుకే ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ అంటే కీలకమైన పదవే.

ఈ పదవికి రెండేళ్ల కాల పరిమితి ఉంటుంది. గతంలో అయితే హరిబాబు వంటి నేతలను సుదీర్ఘ కాలం కొనసాగించారు. కానీ కన్నా లక్ష్మీనారాయణకు ఒక టెర్మ్ తోనే పదవి పోయింది. ఆయన తరువాత వచ్చిన సోము వీర్రాజు పదవి కూడా మరి కొద్ది నెలల్లో ముగుస్తుంది. మామూలుగా అయితే రెండేళ్లలో ఎన్నికలు ఉన్నాయి.

కాబట్టి సోము లాంటి వారిని కంటిన్యూ చేయాలి. కానీ ఇపుడు అవే ఎన్నికలు, అందులో ఎత్తులు, పొత్తులు ఎన్నో ఉంటాయి. అందుకే ఇపుడు అర్జంటుగా సోము వీర్రాజు సీటుకు ఎసరు వచ్చింది అంటున్నారు. నిజానికి సోము వీర్రాజు యాంటీ టీడీపీ స్టాండ్ తీసుకుంటారని అంటారు. ఆయన ఆరెస్సెస్ నేపధ్యం ఉన్న మనిషి. పైగా గోదావరి జిల్లాలకు చెందిన నాయకుడు. తన జీవితం అంతా బీజేపీకి అంకితం చేసిన సోముకు ఎమ్మెల్సీ పదవి మాత్రమే దక్కింది.

అయితే సోము వీర్రాజు ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా పార్టీని నడిపిస్తున్నా ఎత్తిగిల్లడంలేదు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక ఆయన వైసీపీని ఈ మధ్య మాత్రమే విమర్శిస్తున్నారు. అపుడు కూడా టీడీపీతో కలిపి విమర్శలు చేస్తున్నారు. అలాగే సోముకు చంద్రబాబుతో బీజేపీ పొత్తు ఇష్టం లేదు.

దాంతో ఇపుడు సోము పోస్ట్ ని రెన్యువల్ చేయవద్దన్న డిమాండ్ ఆయన వైరివర్గం గట్టిగా వినిపిస్తోంది. ఈ మధ్య సోము లేకుండానే కొందరు కీలక నేతలు మీటింగు పెట్టేశారు. ఒక విధంగా ఏపీ బీజేపీలో అది సంచలనమే అయింది. దాంతోనే సోము బీజేపీ ప్రెసిడెంట్ గిరీ మీద కూడా కొత్త డౌట్లు పుట్టుకువచ్చాయని అంటున్నారు.

మొత్తానికి ఏదైతేనేమి ఏపీలో బీజేపీకి కొద్ది నెలలలో కొత్త ప్రెసిడెంట్ రాబోతున్నారు అన్నది ప్రచారంలో ఉన్న మాట. ఆయన వచ్చాకనే ఏపీలో టీడీపీతో పొత్తులు ఇతర విషయాలు ఒక కొలిక్కి వస్తాయని అంటున్నారు. చూడాలి మరి.