Begin typing your search above and press return to search.
మండలి డిప్యూటీ చైర్మన్ ఆత్మహత్యపై దర్యాప్తు చేయాలి: లోక్ సభ స్పీకర్
By: Tupaki Desk | 30 Dec 2020 10:02 PM ISTకర్ణాటక శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ధర్మే గౌడ ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 65 ఏళ్ల ధర్మే గౌడ మంగళవారం తెల్లవారుజామున చిక్కమంగళూరులోని గుణసాగర్ వద్ద రైల్వే ట్రాక్ పై శవమై కనిపించాడు. ఘటన స్థలిలో సూసైడ్ నోట్ కూడా లభించింది. ఇది కలకలం రేపింది. దీనిపై దేశ రాజకీయ నాయకులు, మీడియా కూడా తీవ్రంగా స్పందించింది.
కర్ణాటక శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ధర్మే గౌడ ఆత్మహత్యపై ఉన్నతస్థాయి స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లా కోరారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడిన ఆయన.. ధర్మెగౌడ మృతి పట్ల సంతాపం ప్రకటించారు.
కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో చైర్మన్ సీట్లో కూర్చున్న ధర్మెగౌడను విపక్ష నేతలు లాగిపడేసిన విషయం తెలిసిందే. దీనిని ప్రస్తావించిన ఓం బిర్లా.. ఈ ఘటన ప్రజాస్వామ్యంపై జరిగిన అతి పెద్ద దాడిగా పేర్కొన్నారు. శాసనసభల ప్రతిష్టను, ప్రిసైడింగ్ అధికారుల గౌరవం, స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులందరిపై ఉందన్నారు.
ధర్మేగౌడ కుటుంబానికి లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లా సానుభూతి తెలిపారు. ఆయన పదవిలో ఉన్నప్పుడు ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని.. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన తీవ్రమైన దాడిగా పేర్కొన్నారు. అతని మరణంపై స్వతంత్ర ఏజెన్సీ ద్వారా ఉన్నత స్థాయి దర్యాప్తు అవసరమని.. శాసనసభల ప్రతిష్టను, గౌరవం.. ప్రిసైడింగ్ అధికారుల స్వేచ్ఛను కాపాడటం మనందరి కర్తవ్యం' అని ఓం బిర్లా పేర్కొన్నారు.