Begin typing your search above and press return to search.

కుప్పం ఓటర్లు ఎటు వైపు... ?

By:  Tupaki Desk   |   14 Nov 2021 2:30 AM GMT
కుప్పం ఓటర్లు ఎటు వైపు... ?
X
కుప్పం. ఇపుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్. కుప్పం మునిసిపాలిటీగా మారిన తరువాత ఫస్ట్ టైమ్ ఎన్నికలు జరుగుతున్నాయి. కుప్పం నియోజకవర్గం ముఖ కేంద్రంగా ఈ మునిసిపాలిటీ ఉంది. కుప్పం నారా చంద్రబాబు సొంత నియోజకవర్గం. 2019 ఎన్నికల తరువాత జరిగిన లోకల్ బాడీ ఎన్నికలు అన్నింటా వైసీపీ మెజారిటీ సీట్లను గెలుచుకుంది. కుప్పం మునిసిపాలిటీని కూడా గెలిచేస్తే ఒక పని అయిపోతుంది అని వైసీపీ భావిస్తోంది. అదే టైమ్ లో కుప్పం మునిసిపాలిటీని నిలబెట్టుకుని అక్కడ నుంచే ఏపీలోని టీడీపీ శ్రేణులకు బలమైన విజయ సంకేతం పంపాలని తెలుగుదేశం ఆరాటంగా ఉంది.

కుప్పం మునిసిపాలిటీలో పాతిక వార్డులు ఉన్నాయి. ఒక విధంగా చూస్తే చాలా చిన్న ఎన్నిక ఇది. కానీ అక్కడ  తెర వెనక ఉన్నది జగన్ చంద్రబాబు కాబట్టి ఎనలేని రాజకీయ  ప్రాధాన్యత చేకూరుతోంది. కుప్పం ఎన్నికలు జరుగుతాయని తెలిసి నోటిఫికేషన్ కంటే ముందే చంద్రబాబు మూడు రోజుల పాటు పర్యటించి వచ్చారు. ఇక తాజాగా నారా లోకేష్ రెండు రోజుల పాటు టూర్ చేసి క్యాడర్ కి జోష్ తెచ్చారు. వైసీపీ విషయానికి వస్తే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మకాం వేసి మరీ మొత్తం సీన్ మార్చాలని చూస్తున్నారు.

ఈ నేపధ్యంలో కుప్పం ఓటర్ల పరిస్థితి ఏంటి, వారి మనోభావాలు ఎలా ఉన్నాయి అన్న దాని మీద చర్చలు జరుగుతున్నాయి. కుప్పం ఓటర్లు ఒక విధంగా డోలాయమానంలో ఉన్నారని అంటున్నారు. నిజానికి వారు టీడీపీ మీద కొంత వ్యతిరేకత కలిగి ఉన్నా చంద్రబాబు టూర్ చేయడం, ఎన్నికల ముందు లోకేష్ కూడా వచ్చి ప్రచారం చేయడంతో కొంత శాంతించారు అన్న మాట ఉంది. అదే టైమ్ లో ఇపుడు టీడీపీకి ఓటేస్తే మునిసిపాలిటీ ఎలా అభివృద్ధి చెందుతుంది అన్న ఆలోచనలో కూడా ఉన్నట్లుగా చెబుతున్నారు. ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది. ఏమైనా మేలు జరిగితే ఆ ప్రభుత్వం నుంచే జరగాలి. ఇన్నాళ్ళూ ప్రగతికి నోచుకోని ప్రజలు అయితే వైసీపీకి ఓటేస్తేనే బాగుంటుంది అన్న ఆలోచనలో ఉన్నారని ప్రచారంలో ఉంది. మరో వైపు టీడీపీని ఇన్నాళ్ళూ ఆదరించిన వారు ఇపుడు అనేక సార్లు చంద్రబాబు, చినబాబు కూడా కుప్పాన్ని గుర్తు పెట్టుకుని మరీ వస్తున్నారు కాబట్టి వారికే ఓటేస్తే ఎలా ఉంటుంది అన్న సెంటిమెంట్ తో కూడా ఉన్నారని టాక్.

ఇక కుప్పంలో ప్రలోభాలకు ఆకాశమే హద్దు అన్నట్లుగా పరిస్థితి ఉంది అంటున్నారు. అయిదురుగు కుటుంబ సభ్యులు  ఉంటే టీవీ లేదా ఫ్రిజ్ వంటి తాయిలాలు ఆశ చూపిస్తున్నారు అన్న ప్రచారం ఉంది. అలాగే నగదు పంపిణీకి కూడా జోరుగా జరుగుతోందని వార్తలు అయితే గుప్పుమంటున్నాయి. ఒక్కడ ఒక మాట చెప్పుకోవాలి. కుప్పంలో పాతికకు పాతిక వార్డులు గెలుస్తామని వైసీపీ అంటోంది. మేము మొత్తం స్వీప్ చేస్తామని టీడీపీ చెబుతోంది. అయితే హోరాహోరీ పోరు మాత్రం తప్పదనే అంటున్నారు. ఈసారి గట్టిగానే ఫైట్ ఉంటుందని, ఎవరు గెలిచినా ఎడ్జ్ లోనే అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.