Begin typing your search above and press return to search.
హైదరాబాద్ లో కొట్టుకొస్తున్న శవాలు.. ఏం జరిగి ఉంటుంది?
By: Tupaki Desk | 16 Oct 2020 10:15 AM ISTభారీ వర్షం చేసిన నష్టం అంతా ఇంతా కాదు. ఆస్తి నష్టం.. పంట నష్టం సంగతి ఎలా ఉన్నా.. ప్రాణనష్టం ఎక్కువగా ఉండటాన్నిజీర్ణించుకోలేకపోతున్నారు. చెరువుల్లో.. నాలాల్లో కొట్టుకొస్తున్న శవాలతో.. ఏ నిమిషాన ఏం వినాల్సి వస్తుందన్న భయాందోళనలకు గురవుతున్నారు. ఇటీవల కాలంలో విపత్తు సమయాల్లో ఇంత భారీగా ప్రాణ నష్టం చోటు చేసుకోలేదంటున్నారు. విపత్తును అంచనా వేయటంలో జరిగిన లోపం.. తీవ్రతను ప్రభుత్వం గుర్తించి.. అధికారుల్ని అలెర్టు చేసినా.. వారు ప్రజలకు జాగ్రత్తలు చెప్పే విషయంలో దొర్లిన తప్పులే భారీ ప్రాణ నష్టానికి కారణంగా చెబుతున్నారు.
హైదరాబాద్ మహానగరంలో ఒక్క గురువారమే పన్నెండు శవాలు కొట్టుకొచ్చాయి. వీటిలోచాలావరకు బైకుల మీద బయటకు వెళ్లి.. వరద తీవ్రతను అంచనా వేయటంలో విఫలం కావటమే కారణంగా భావిస్తున్నారు. హైదరాబాద్ లోని చెరువులు.. నాలాల్లో కొట్టుకొస్తున్న శవాలు వివిధ ప్రాంతాలకు చెందిన వారున్నారు. తొర్రూరుకు చెందిన ప్రణయ్.. జైదీప్ లు బైక్ మీద బయటకు వెళ్లారు. తుర్కయాంజాల్ లో పొంగిపొర్లుతున్న మాసబ్ చెరువు అలుగును దాటే ప్రయత్నంలో ప్రవాహ తీవ్రతకు కొట్టుకుపోయారు. వీరి మృతదేహాలు బయటకు వచ్చాయి. అదే రీతిలో తారామతి పేట్ ఔటర్ రింగురోడ్డు వద్ద చెట్టు వద్దకు మరో మృతదేహాం కొట్టుకొచ్చిన వైనం వెలుగు చూసింది. మరణించిన వ్యక్తి హిమాచల్ ప్రదేశ్ కు చెందిన విపిన్ కుమార్ గా గుర్తించారు. ఇతగాడు గౌరెల్లిలో ఉంటున్నాడు.
గల్లంతైన వారు.. కొట్టుకొచ్చిన వారంతా కూడా ఏదో ఒక వాహనంతో ప్రయాణించిన వారే. వరద నీటిని.. తీవ్రతను అంచనా వేయటంలో జరిగిన పొరపాటుతో వారు ప్రాణాల్ని కోల్పోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే.. నగరానికి చెందిన పలువురి ఆచూకీ లభించలేదని చెబుతున్నారు. రోజులు గడుస్తున్నా.. వారి నుంచి ఎలాంటికబురు రాకపోవటంతో బాధితుల కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. దీంతో.. ఏ నిమిషాన ఎలాంటి కబురు వినాల్సి వస్తుందన్న భయంతో సంబంధిత కుటుంబాల వారున్నారు.