Begin typing your search above and press return to search.
కార్పొరేటర్ భర్త అక్రమ సంబంధం .. రెడ్‌హ్యాండెడ్ గా పట్టుకున్న ఫ్యామిలీ, చెప్పులతో దాడి
By: Tupaki Desk | 13 Oct 2021 1:18 PM ISTనిజామాబాద్ లో ఓ మహిళ కార్పొరేటర్ భర్తను చెప్పుతో చెడామడా కొట్టేసింది. తన కూతురితో వివాహేతర సంబంధం పెట్టుకుని తమ ఇంట్లో చిచ్చు పెట్టారని ఆరోపిస్తూ… చెప్పుతో ఎడాపెడా వాయించేసింది ఆ మహిళ. నిజామాబాద్‌లో కార్పొరేటర్ భర్త ఆకుల శీను తమ కూతురిని మోసం చేశాడంటూ ఇంటిముందు బాధితులు ఆందోళనకు దిగారు. రాత్రి తమ కూతురి ఎత్తుకెళ్లిన కార్పొరేటర్ భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని బాధితులు చెబుతున్నారు. గతంలో తమ కూతురిని విడిచిపెట్టాలని మందలించినా తీరు మార్చుకోలేదని వాపోయారు.
తమకు న్యాయం చేయాలంటూ అమ్మాయి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. అతను భార్యకు విడాకులు ఇచ్చి.. తన బిడ్డను చేసుకుంటే ఇబ్బంది లేదని, కానీ ఇలా చెయ్యడం కరెక్ట్ కాదంటున్నారు యువతి పేరెంట్స్. యువతి పేరెంట్స్ దాడి చేస్తోన్న సమయంలో అతని భార్య, పిల్లలు కూడా అక్కడే ఉన్నారు. ఇరుగుపొరుగు వారు చెప్పినా, వారు వినే పరిస్థితుల్లో లేకపోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. సమస్య ఉంటే కేసు పెట్టాలని,. ఇలా గొడవ చేయడం వల్ల ఉపయోగం ఉండదని సర్దిచెప్పారు. కాగా స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశమైంది. కార్పొరేటర్ భర్త వైఖరిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత రాత్రి తమ బిడ్డని ఎత్తుకెళ్లాడని ఆరోపించారు. మాయ మాటలు చెప్పి మోసం చేశాడని మండిపడ్డారు. తమ కూతురిని ఎత్తుకెళ్లి కాంగ్రెస్ సర్పంచ్ ఇంట్లో ఉంచినట్టు వారు ఆరోపించారు. తమ అమ్మాయిని అప్పగించాలంటూ తల్లిదండ్రుల ఆందోళన చేస్తున్నారు.