Begin typing your search above and press return to search.

ఇప్పటివరకు ఎంతమందికి ఉద్యోగాలిచ్చారు సారూ!

By:  Tupaki Desk   |   22 Jun 2022 11:30 AM GMT
ఇప్పటివరకు ఎంతమందికి ఉద్యోగాలిచ్చారు సారూ!
X
‘అగ్నిపథ్’ పథకంపై బహిరంగ ఆందోళనలు లేకున్నా.. ఇన్నర్ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు యువత మాత్రమే వ్యతిరేకిస్తుండగా.. ఇప్పుడు మాజీ సైనికాధికారులు కూడా తమ ఆగ్రహాన్ని వెల్లగక్కుతున్నారు. అయితే అగ్నిపథ్ పథకంపై ఎలాంటి ఆందోళనలు కొనసాగుతున్నా కొన్ని కార్పొరేట్ కంపెనీలు మాత్రం దీనిని మద్దతిస్తున్నాయి.

సైన్యంలోకి వెళ్లి వచ్చిన అగ్ని వీరులకు తమ సంస్థల్లో ఉద్యోగాలిస్తామని ప్రకటిస్తున్నాయి. తాజాగా ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర సైతం అగ్నిపథ్ అభ్యర్థులకు తమ సంస్థలో ఉద్యోగాలిస్తామని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అయితే ట్వీట్ పై మాజీ సైనికాధికారులు ఘాటుగా స్పందించారు.

ఆనంద్ మహీంద్ర చేసిన ట్వీట్ పై యువతతో పాటు మాజీ సైనికాధికారులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. భారత నౌకాదళం చీఫ్, చీఫ్ ఆప్ స్టాప్ కమిటీ మాజీ చైర్మన్ అడ్మిరల్ అరుణ్ ప్రకాశ్ తనదైన శైలిలో రీ ట్వీట్ చేశారు. సైన్యంలోకి వెళ్లి వచ్చిన వారిలో ఇప్పటి వరకు ఎంతమందికి ఉద్యోగాలిచ్చారని అడిగారు.

‘కొత్త పథకం కోసం ఎందుకు వేచి చడాలి.. ఇప్పటికే నైపుణ్యం, క్రమశిక్షణ కలిగిన వేలాది మంది సైనికులు జనంలో ఉన్నారు. ఏటా వేల సంఖ్యలో సైన్యం బయటకు వస్తోంది. కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తోంది.’

‘అలాంటి వారు మీకు కనిపించలేదా..? అలాంటి వారిలో ఇప్పటివరకు మీరు ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు..? ఆ వివరాలు వెల్లడిస్తే బాగుంటుంది..’ అనిఅరుణ్ ప్రకాశ్ రిప్లై ఇచ్చారు. మరో అధికారి మాజీ ఎయిర్ వైస్ మార్షల్ మన్మోహన్ బహదూర్ ఇదే విధంగా స్పందించారు. ‘ఆనంద్ మహీంద్రా సార్.. నేను నలబై ఏళ్లు భారత వాయుసేనలో ఉన్నాను. ఇలాంటి హామీలు ఎన్నో వింటున్నాను. హామీల వరకే.. ఆవి నేరవేర్చరు’ అని అన్నారు.

అయితే ఆనంద్ మహీంద్రా ట్వీట్ కు ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష గోయెంకా మద్దతు పలికారు. అగ్ని వీరులకు తమ సంస్థల్లో కూడా అవకాశాలు ఉంటాయని తెలిపారు. మిగతా సంస్థలు కూడా ఇదే బాటలో వెళ్లాలని సూచించారు. ఇదిలా ఉండగా ఆనంద్ మహీంద్రా కంపెనీలో ఎటువంటి ఉద్యోగాలిస్తారాని ఓ యువకుడు ప్రశ్నించగా.. ఆయన స్పందించారు. దీనికి ఆయన సమాధానమిస్తూ కార్పొరేట్ సెక్టార్లో అనేకా అవకాశాలున్నాయి. లీడర్ షిప్, టీమ్ వర్క్, ఫిజికల్ ట్రైయినింగ్ సహా అన్ని ప్రొఫెషనల్ గా మార్కెట్ చేయడానికి సిద్ధంగా ఉండాలి.. అని అన్నారు.