Begin typing your search above and press return to search.
ఏపీలో జగన్ గెలుస్తారని కార్పొరేట్ లకు ముందే తెలిసిపోయిందా?
By: Tupaki Desk | 17 Nov 2019 2:45 PM ISTఎవరు అవునన్నా..కాదన్నా దేశంలో రాజకీయాల్ని సైతం ప్రభావితం చేసేది కార్పొరేట్లు అన్న విషయాన్ని ఎవరూ కాదనలేరు. అగ్రరాజ్యమైన అమెరికా కావొచ్చు.. డెవలప్ అవుతున్న భారత్ కావొచ్చు. ఎక్కడైనా సరే.. ఎన్నికలు.. రాజకీయాల్ని ప్రభావితం చేసేందుకు అవసరమైన సంపదలో కీలకమొత్తాన్ని సమకూర్చేది కార్పొరేట్ ప్రపంచమే అన్నది మర్చిపోకూడదు.
ప్రజల్లో వస్తున్న మార్పును.. ఎన్నికల వేళలో వారి మూడ్ ను అంచనా వేయటంతో పాటు.. ఏ పార్టీకి విజయవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న విషయాన్ని కార్పొరేట్లు డిసైడ్ చేస్తారని చెప్పాలి. ఇదెలా చెబుతారని చాలామందికి సందేహం వస్తుంది కానీ.. వివిధ రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించే పార్టీల ఆదాయ వ్యయ లెక్కల్నిచూసినప్పుడు ఈ విషయం ఇట్టే అర్థం కాక మానదు.
కార్పొరేట్లు ఎక్కువగా విరాళాల రూపంలో డబ్బులు ఇస్తారో.. సాధారణగా ఆ పార్టీనే విజయం సాధించే పరిస్థితి ఉంటుందని చెబుతారు. 2014లో కానీ 2019లో కానీ జరిగిన ఎన్నికలు దీనికి నిదర్శనంగా చెప్పాలి. కేంద్రంలో మోడీ సర్కారు విజయం సాధిస్తుందన్న దానికి ముందే..కార్పొరేట్లు ఇచ్చే విరాళాల్ని చూస్తే.. ఏ పార్టీకి అయితే పెద్ద మొత్తంలో విరాళాలు అందుతాయో.. ఆ పార్టీ ఎన్నికల్లో గెలుపొందటం ఖాయమని చెప్పాలి.
తాజాగా ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా ఇదే విషయాన్నిస్పష్టం చేస్తున్నాయని చెప్పాలి. టీడీపీ అనుకూల మీడియా ఎంత గొంతు చించుకొని గెలిచేది బాబు అని చెప్పినా.. కార్పొరేట్ ప్రపంచం నుంచి వచ్చిన విరాళాలు చాలు.. ఎవరు గెలుస్తారన్న విషయంపై ఇట్టే అర్థం కాక మానదు.
2018తో పోలిస్తే 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కార్పొరేట్ల నుంచి వచ్చిన విరాళాలు భారీగా పెరిగాయి. 2018లో కార్పొరేట్ల నుంచి రూ.2.5 కోట్ల మొత్తం అధికారికంగా విరాళాల రూపంలో వస్తే.. 2019లో ఆ మొత్తం రూ.18.15 కోట్లకు పెరగటం గమనార్హం. వార్షిక బడ్జెట్ తో పాటు.. బ్యాలెన్స్ షీటు కూడా భారీగా పెరిగిన వైనం చూస్తే.. పార్టీ గెలుపు ముందే డిసైడ్ అయ్యిందన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు.