Begin typing your search above and press return to search.

కార్పొరేట్ ఉద్యోగి.. కార్పొరేటర్ ఎలా అయ్యింది

By:  Tupaki Desk   |   8 Dec 2020 12:07 PM IST
కార్పొరేట్ ఉద్యోగి.. కార్పొరేటర్ ఎలా అయ్యింది
X
గ్రేటర్ ఎన్నికల్లో కార్పొరేట్ ఉద్యోగి కార్పొరేటర్ అయ్యింది. గ్రేటర్ ఎన్నికల్లో హైదరాబాద్ చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో విజయం సాధించి సామల హేమ రికార్డు సృష్టించింది. ఎంబీఏ చదివిన హేమకు గూగుల్‌లో ఏడు నెలల క్రితం గూగుల్‌లో ఉద్యోగం వచ్చింది. అంతకు ముందు జెన్‌పాక్ట్‌లో ఉద్యోగం చేసింది. జాబ్ చేస్తూనే కీసరలోని అశ్విత్ జీజస్ కాలేజ్‌లో ఫైనాన్స్‌లో ఎంబీఏ చేసింది. అమ్మ, నాన్న, అన్నయ్య ఇదే ఆమె జీవితం. కానీ గ్రేటర్ ఎన్నికలు ఆమె జీవితాన్నే మార్చేశాయి.

సికింద్రాబాద్‌ నియోజకవర్గం సీతాఫల్‌మండికి చెందిన సామల రాజు (అలియాస్‌ కరాటే రాజు), జ్యోతి దంపతుల కుమార్తె సామల హేమ ప్రసుత్తం ఉస్మానియావర్సిటీలో కామర్స్‌ ఆఫ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కాలేజీలో పీహెచ్‌డీ చేస్తున్నారు.

2013-15 వరకు జన్‌ప్యాక్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా చేసిన హేమ 2015లో గూగుల్‌లో చేరారు. 2016లో యూఎస్‌ వెళ్లటానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇంతలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల నగారా మోగింది. సికింద్రాబాద్‌ నియోజకర్గంలోని అన్ని డివిజన్‌లు మహిళలకు రిజర్వు అయ్యాయి.

అప్పటి మంత్రి, ప్రసుత్త డిప్యూటీ స్పీకర్‌ తీగుళ్ల పద్మారావుగౌడ్‌ ఏకంగా సామల హేమకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సీతాఫల్‌మండి నుంచి అవకాశం కల్పించారు. కుటుంబసభ్యుల కోరిక మేరకు యూఎస్‌ వెళ్లే ఆలోచనకు విరామం ఇచ్చి ఎన్నికల బరిలో నిలిచారు.

16 వేల ఓట్ల మెజారిటీతో సీతాఫల్‌మండి కార్పొరేటర్‌గా తొలి విజయం సాధించారు. ప్రజల్లో తిరుగుతూ, అధికారుల సమావేశాల్లో పాల్గొంటూ ప్రజాసమస్యలపై అవగాహన పెంచుకున్నారు. అటు క్లాస్‌ను, ఇటు మాస్‌ను అందరినీ ఆకట్టుకుంటూ రెండో సారి తాజాగా 2020 జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ పోటీచేసి రెండోసారి నెగ్గి రాజకీయాల్లో రాణిస్తున్నారు హేమ. గూగుల్ ఉద్యోగి హైదరాబాద్ కార్పొరేటర్ గా మారిన వైనం యువతకు స్ఫూర్తినిస్తోంది.