Begin typing your search above and press return to search.
వైసీపీ ప్రభుత్వంలో బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జికి కార్పొరే‘షన్’ చైర్మన్ పదవా?
By: Tupaki Desk | 15 Aug 2020 6:31 PM ISTఅత్త సొమ్ము అల్లుడు దానం చేసిన చందంగా వైసీపీ పోస్టులను ఓ ఎమ్మెల్యే పక్కపార్టీ నేతలకు ఇస్తున్నాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ కోసం కష్టపడ్డ వారిని వదిలేసి బీఎస్పీ నేతలకు కార్పొరేషన్ పదవి ఇవ్వడంపై అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలోనే జరుగుతున్న ఈ దారుణంపై వైసీపీ నేతలంతా జీర్ణించుకోవడం లేదట.. ఈ మేరకు అధిష్టానం పట్టించుకోవాలంటూ మొర పెట్టుకుంటున్నారు.
సీఎం జగన్ గారు ఇది విన్నారా..? పార్టీని నమ్ముకొని 10 సంవత్సరాలుగా జెండా మోస్తే.. ప్రకాశం జిల్లాలో పక్కపార్టీ వారికి పదవులు ఇస్తున్నారని ఆ జిల్లా నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. పశ్చిమ ప్రకాశం జిల్లాలోని ఒక వైసీపీ ఎమ్మెల్యే గత మున్సిపాలిటీ ఎన్నికల్లో తన అభ్యర్థులకు బీఎస్పీ పార్టీ ‘బీ ఫామ్స్’ ఇచ్చారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించే అదే ఎమ్మెల్యే నియోజకవర్గం బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జికి ఏకంగా వైసీపీ కార్పొరేషన్ చైర్మన్ పోస్టు ఇస్తున్నారట..
ఏరోజు పార్టీకి పనిచేయని వ్యక్తి.. వైఎస్ఆర్ ను ఇష్టం వచ్చినట్టు తిట్టిన వ్యక్తికి.. జగన్ అంటే పడని వ్యక్తికి.. బహిరంగంగా జగన్ ను తిట్టే వ్యక్తికి ఈరోజు కార్పొరేషన్ చైర్మన్ పోస్టు ఇస్తున్నారంటే నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆవేదన చెందుతున్నారట.. తాము ఏం అయిపోవాలని నియోజకవర్గం వైసీపీ నేతలంతా వాపోతున్నారు.
10 ఏళ్లుగా పార్టీని నడిపించిన బీసీ లీడర్స్ కు ఇవ్వకుండా.. వైసీపీ ఎమ్మెల్యే తన స్వార్థం కోసం వైసీపీ నేతలకు కాకుండా తన మనషులకు ఇస్తున్నాడని వైసీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడయినా జిల్లాకు సంబంధించిన మంత్రులు, ఏపీ సీఎం పట్టించుకోవాలని అక్కడున్న నాయకులు కోరుతున్నారు.