Begin typing your search above and press return to search.

డేంజర్ : భారత్ స్లమ్స్ లో ఆ కరోనా డ్రగ్ ప్రయోగం?

By:  Tupaki Desk   |   19 April 2020 10:00 PM IST
డేంజర్ : భారత్ స్లమ్స్ లో ఆ కరోనా డ్రగ్ ప్రయోగం?
X
కరోనాకు ఇప్పటివరకు మందు లేదు. అయితే భారత్ తయారు చేస్తున్న ఆ డ్రగ్ కరోనాపై పనిచేస్తోంది. ఇప్పుడు ఆ మందును భారత్ లోని అతిపెద్ద మురికివాడల్లో నివసిస్తున్న జనాలపై ప్రయోగించబోతున్నారా? అక్కడ ప్రబలుతున్న కరోనాను నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ డ్రగ్ ను వారికి ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తోందా? అంటే ఔనని ప్రముఖ మీడియా సంస్థలు కథనాలు రాస్తున్నాయి. ఈ మేరకు నివేదికలను ముంబై మీడియా బయటపెడుతోంది.

ఆసియాలోనే అతిపెద్ద మురికివాడలు భారత్ లో ఉన్నాయి. ముంబైలోని ధారవి - వర్లీలు అతిపెద్ద - అత్యంత రద్దీ కలిగిన పేదల మురికివాడలుగా ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ కరోనా వైరస్ విపరీతంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే ధారవి మురికివాడల్లో కరోనా కేసులు 100 దాటాయి. ఈ నేపథ్యంలోనే మురికివాడల జనాలపై ‘హైడ్రాక్సి క్లోర్లోక్విన్’ డ్రగ్ ప్రయోగం చేసేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొద్దిరోజుల క్రితం కరోనాపై ‘హైడ్రాక్సి క్లోర్లోక్విన్’ ఉపయోగించాలని.. దీని ద్వారా కరోనా తగ్గుతుందని సూచించారు. అంతేకాదు.. భారత్ తో ఫైట్ చేసి పెద్ద ఎత్తున దేశంలోకి దిగుమతి చేసుకున్నారు. దీనిని ‘మ్యాజిక్ డ్రగ్’ అని కూడా ట్రంప్ పిలుపునిచ్చారు.

సాధారణంగా హైడ్రాక్సి క్లోర్లోక్విన్ సాధారణంగా మలేరియా నివారణ లూపస్ (చర్మ ఇన్ ఫెక్షన్లు) చికిత్సకు ఉపయోగిస్తారు.

ప్రపంచంలోనే హైడ్రాక్సి క్లోర్లోక్విన్ అతిపెద్ద ఉత్పత్తిదారుల్లో భారతదేశం ఒకటి. ప్రతీ సంవత్సరం 50 మిలియన్ డాలర్ల విలువగల మందులను ఎగుమతి చేస్తుంటుంది. మొదట్లో కరోనా కారణంగా భారత్ లో దీని ఎగుమతి నిషేధించినప్పటికీ ట్రంప్ ఒత్తిడితో దాన్ని ఇప్పుడు సడలించారు. అమెరికాతోపాటు 50దేశాలకు ఇప్పుడు ఈ మందును భారత్ ఎగుమతి చేస్తోంది.

తాజాగా ఈ హైడ్రాక్సిక్లోర్లోక్విన్ అధిక వినియోగం డేంజర్ అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) మంగళవారం హెచ్చరించింది. డాక్లర్ల పర్యవేక్షణ లేకుండా తీసుకోవద్దని స్పష్టం చేశారు. అత్యవసరంగా మాత్రమే వాడాలని సూచించారు. అయితే అమెరికాలో ట్రంప్ పిలుపుతో కరోనాకు ఇదే మందు అని ఒక న్యూయార్క్ మహిళ వాడి ఇప్పుడు ప్రాణాలు పోగొట్టుకోవడం విషాధం నింపింది.

కరోనావైరస్ సోకిన వారి చికిత్సకు ఈ డ్రగ్ పనిచేస్తుందని అధికారికంగా నిరూపించబడలేదు. అయితే దీనిని రోగనిరోధక శక్తిని మెరుగుపరిచి కరోనా తగ్గిస్తుందని తేలింది. ఇప్పుడు ఈ మందును పరీక్షించడానికి జనసాంద్రత కలిగిన మురికివాడ ధారావి ఒక లక్ష్యంగా అధికారులు ఎంచుకున్నట్టు ప్రచారం సాగుతోంది. ముంబైలో తీవ్రంగా దెబ్బతిన్న వర్లి మురికివాడ జనాలకు దీన్ని ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారట ఇక్కడ అధికారులు. హైడ్రాక్సీక్లోరోక్విన్ డోసింగ్ డ్రైవ్‌ ను ముందస్తుగా మందులుగా ప్రారంభించాలని యోచిస్తున్నారు.18 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సు గల 50 వేల మందికి - గుండె మరియు కాలేయ వ్యాధులు లేనివారిని మోతాదులో ఇచ్చే యోచనలో అధికారులు ఉన్నారు.

ఇందుకోసం ఏకంగా 4500 మందికి పైగా ఆరోగ్య సంరక్షణ కార్మికులను వినియోగించనున్నారట.. 25-30 ఇళ్లకు ఒకరిని నియమించి ఈ మందును పంపిణీ చేయబోతున్నారు. మందుల నిర్వహణలో మూడు నుంచి ఏడు వారాల పాటు ఈ మందులు ఇచ్చి వాటి దుష్ప్రభావాలను పరిశీలిస్తారట..

మరి మురికివాడల్లోని పేదలపై ఈ కరోనా మందు పనిచేస్తుందా? వారి ప్రాణాలు తీస్తుందా? అనేది మాత్రం తెలియదు.. కానీ అమయాకులపై ఈ డ్రగ్ ప్రయోగంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మీడియా నివేదికలు నిజమైతే మాత్రం దీనిపై పెద్ద దుమారం రేగడం ఖాయంగా కనిపిస్తోంది. మనుషుల ప్రాణాలతో ఆడే ఈ వికృత క్రీడను ఆపాలని అక్కడి మీడియా కథనాలు ప్రసారం చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఈ డ్రగ్ కరోనాకు తగ్గిస్తుందని ఘంఠాపథంగా చెబుతున్నారు. ఏం జరుగుతుందనేది వేచిచూడాలి.