Begin typing your search above and press return to search.

ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణ మృదంగం

By:  Tupaki Desk   |   27 March 2020 5:30 AM GMT
ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణ మృదంగం
X
కరోనా కల్లోలం ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. అన్ని దేశాల్లో కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అంతే స్థాయిలో మరణాలు సంభవిస్తున్నాయి. శుక్రవారం వరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 5,32,224 మందికి చేరింది. ఇక కరోనాతో మరణించిన వారి సంఖ్య 24,087కు చేరింది. ఇందులో 1,24,326 మంది కరోనా వైరస్ బారి నుంచి రికవరీ అయ్యారు.

దేశాల వారీ గా చూస్తే ప్రస్తుతం చైనాను అమెరికా దాటేసింది. అమెరికాలో కరోనా మరణ మృదంగం వినిపిస్తోంది. అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 1182కు చేరింది. మొత్తం కేసులు 82547కు చేరాయి. కొత్తగా 14336మంది కరోనా సోకడంతో అమెరికా విలవిలలాడుతోంది. అత్యాధునిక వైద్య సదుపాయాలున్న అమెరికాలో ఇప్పుడు వెంటీలేషన్లు సరిపోక రోగులు మరణిస్తున్న పరిస్థితి నెలకొంది.

కరోనాతో అత్యధిక మరణాలు ఇటలీలో ఉన్నాయి. ఇటలీలో కరోనా కేసుల సంఖ్య 81285కు చేరగా.. మరణాలు 8215కు చేరాయి. ఇక కొత్త కేసులు 6203 నమోదయ్యాయి.

ఇక చైనాలో కొత్త కేసులు ఆగిపోయాయి. మొత్తం కేసులు 81285 నమోదుకాగా.. ఇప్పటికే చావులు 3287 ఉన్నాయి.

నాలుగో స్థానంలో స్పెయిన్ దేశం ఉంది. స్పెయిన్ లో కరోనా కేసులు 57786కు చేరింది.. 4364మంది కరోనా కాటుకు చనిపోయారు. కొత్త కేసులు 8271 నమోదయ్యాయి.

ఆ తర్వాత వరుసగా జర్మనీలో 43వేల కేసులు, ఇరాన్ లో 29వేల కేసులు - ఫ్రాన్స్ లో 29వేలు - స్విట్జర్లాండ్ లో 11వేల కేసులు - సౌత్ కొరియాలో 9241 కేసులు నమోదయ్యాయి.

ప్రధానంగా అమెరికా ఇటలీ - స్పెయిన్ - ఇరాన్ - దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. కరోనా మరణాల్లో చైనాను తాజాగా అమెరికా కూడా దాటేసింది. స్పెయిన్ లో గడిచిన 24 గంటల్లో 738మంది మరణించడం గుబులు రేపుతోంది.

అమెరికాలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. నిన్న ఒక్క రోజే అమెరికాలో 14336 కొత్త కేసులు నమోదైనట్లు ఆ దేశ వైద్య శాఖ అధికారులు ప్రకటించారు. నిన్న ఒక్కరోజే 155 మందికి పైగా మరణించగా.. గురువారం 24గంటల్లో 1182మంది చనిపోవడం అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేస్తోంది.

ఇక భారత్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య 693కు చేరువైంది. 16 మంది దేశంలో కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర, కేరళల్లో కరోనా కేసుల సంఖ్య 100 దాటింది. బుధవారం ఒక్కరోజే దేశంలో 94 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 119 - కేరళలో 114 కేసులు నమోదయ్యాయి.

తెలంగాణ కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 45కు చేరింది. కుత్బుల్లాపూర్ లో నివాసం ఉండే ఓ వ్యక్తి కరోనా సోకింది. ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇక తాజాగా ఓ వైద్యుడు, అతడి భార్యకు కరోనా సోకింది. ఇక సికింద్రాబాద్ లో నివాసం ఉండే వ్యక్తికి కరోనా నిర్ధారణ అయ్యింది.

ఆంధ్రప్రదేశ్ లో గురువారం మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 11కి చేరింది. స్వీడన్ నుంచి విజయవాడకు వచ్చిన 28 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ మేరకు ఏపీ ఆరోగ్యశాఖ గురువారం రాత్రి బులిటెన్ విడుదల చేసింది.