Begin typing your search above and press return to search.
రోజులో రూ.5.5లక్షల కోట్ల సంపద మాయమైపోయింది
By: Tupaki Desk | 29 Feb 2020 10:45 AM ISTకంటికి కనిపించనంత చిన్న వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. స్టాక్ మార్కెట్ ను షేక్ చేస్తోంది. అంతకంతకూ విస్తరిస్తున్న కొవిడా (కరోనా) వైరస్ కారణంగా శుక్రవారం భారత స్టాక్ మార్కెట్ ఢమాల్ అన్నది. ఈ వైరస్ ను కట్టడి చేయటం ఎలా అన్నది అర్థం కాక తలలు పట్టుకుంటున్న శాస్త్రవేత్తలతో పాటు.. పలు దేశాలు భయంతో వణికిపోతున్నాయి. ఈ వైరస్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సైతం నెమ్మదిగా సంక్షోభంలోకి జారుకునే ప్రమాదం ఉందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
కొవిడ్ వైరస్ ఎఫెక్ట్ తో శుక్రవారం భారత్ తో పాటు అమెరికా.. యూరోప్ తో పాటు ఆసియాలోని పలు దేశాల స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. భారత్ లో అయితే ఏకంగా శుక్రవారం ఒక్క రోజే రూ.5.5లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. 2015 ఆగస్టు 24 తర్వాత సెన్సెక్స్ ఇంత భారీగా పడి పోవటం ఇదే తొలిసారి. మదుపరుల సొమ్ము ఇంత భారీగా ఆవిరి కావటం తో ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి. ఇదిలా ఉంటే.. డాలర్ మారకం లో రూపాయి భారీగా నష్ట పోయింది. 63 పైసలు ఒక్కరోజులో కోల్పోయి రూ.72.24 వద్ద స్థిరపడింది.
కొవిడ్ కారణంగా ముడి చమురు డిమాండ్ భారీగా పడిపోయింది. దీంతో.. ధరలు విపరీతంగా పడిపోతున్నాయి. శుక్రవారం బ్యారెల్ ముడిచమురు 50 డాలర్లకు తగ్గి పోయింది. కొవిడ్ వైరస్ ప్రభావం భారత్ లో ఏ మాత్రం లేకున్నా.. విపరీతమైన భయాందోళనలు..మార్కెట్ సెంటిమెంట్ సరిగా లేక పోవటంతో తీవ్ర నష్టాలకు గురి అవుతున్నాయి. కొవిడ్ కారణంగా ముడిచమురు ధరలు భారీగా పడి పోవటంతో.. ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరటంతో పాటు.. డాలర్ చెల్లింపుల భారం కొంతమేర ఉపశమనాన్ని కలిగిస్తుందని చెప్పక తప్పదు.