Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్ : అంబానీ ఆస్తిలో ఆవిరైపోయిన లక్షన్నర కోట్లు !

By:  Tupaki Desk   |   19 March 2020 12:00 PM IST
కరోనా ఎఫెక్ట్ : అంబానీ ఆస్తిలో ఆవిరైపోయిన లక్షన్నర కోట్లు !
X
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను కబళిస్తోంది. ఈ మహమ్మారి ధాటికి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపుగా 9 వేల మంది వరకు ప్రాణాలు విడిచారు.కరోనా ప్రభావంతో గత కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్లు నష్టాలలోనే ట్రేడ్ అవుతున్నాయి. అన్ని దేశాల ఈక్విటీ మార్కెట్లు పతనం అయ్యాయి. అలాగే కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మద్యంలోకి నెడుతుందనే ఊహాగానాలతో అపర కుబేరుడు ముకేశ్ అంబానీ ఆస్తి విలువ భారీగా తగ్గిపోయింది.

కరోనా వైరస్ వ్యాప్తి కారణం ప్రపంచ వ్యాప్తంగా చమురు వినియోగం బాగా తగ్గిపోయింది. అలాగే చమురు ఉత్పత్తి చేసే ప్రధాన దేశాలలో ఉత్పత్తి ధరల యుద్ధం కూడా దీనికి మరో కారణం అయ్యింది. ఈ కారణంతో చమురు ధరలు 29 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయాయి. చమురు ధరల ప్రభావం అంబానీ కి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పై భారీగా ప్రభావం చూపించింది. భారతీయ దిగ్గజ సంస్థ అయిన ఈ కంపెనీ షేర్స్ విలువ గత కొన్నిరోజులుగా తగ్గుతూనే వస్తుంది. కరోనావైరస్ దెబ్బకు మార్కెట్లు కుదేలు కావడం అదే సమయంలో ఆయన చమురు ధరలు పడిపోవడంతో ముఖేష్ అంబానీ అగ్రస్థానంను కోల్పోయారు.

ఒక్కసారిగా అంబానీ నికర ఆస్తుల విలువ 2020 కోట్ల డాలర్లకు పడిపోవడంతో ఆసియాదేశపు అత్యంత ధనికుల జాబితాలో రెండో స్థానానికి పడిపోయారని బ్లూంబర్గ్ నివేదిక వెల్లడించింది. బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం అంబానీ ప్రస్తుత సంపద 3800 కోట్ల డాలర్లు. అయితే , ఈ ఏడాది మార్చి 16 వరకు అంబానీ ఆస్తుల విలువ 2020 కోట్ల డాలర్లు తగ్గింది. అంటే మన కరెన్సీ లో దాదాపుగా 1.50 లక్షల కోట్లు. దీనితో అంబానీ మొదటి స్థానాన్ని కోల్పోయారు. ఇదే సమయంలో టిసిఎస్ మార్కెట్ విలువ భారీగా పెరగడంతో ..అంబానీ ని వెనక్కి నెట్టి టీసీఎస్ అత్యంత విలువైన కంపెనీ గా మొదటి స్థానాన్ని ఆక్రమించింది.